మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్న వెటర్నరీ డాక్టర్లను ఘనంగా సన్మానించారు. జంతు సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణలో వారు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ శ్రీ ముత్యాల ప్రసాద్, మండల వైస్ ఎంపీపీలు శ్రీ సి. బాషా, శ్రీ చెన్ను రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుసంవర్ధక రంగానికి సేవలు అందించడం గర్వకారణమని, తమ బాధలను చెప్పలేని మూగజీవుల బాధలను అర్థం చేసుకుని సేవలు అందిస్తున్న వెటర్నరీ వైద్యులను అభినందించారు.
ఫౌండేషన్ చైర్మన్ డా. చిత్తా రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా మరణించిన పశువైద్యులు డా. అంబవరపు లక్ష్మి రెడ్డి గారి స్మారకంగా అవార్డులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఆయన సేవలను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన కూతురు శ్రీమతి సుధారాణి గారు ఆయన సేవలను వివరించగా, అందరూ శ్రద్ధగా విని నివాళులు అర్పించారు.సన్మాన గ్రహీతలు:డా. కత్తి చంద్రశేఖర్డా. కలవకూరి వెంకటసుబ్బయ్యడా. బండి శివ శ్రీనివాసుల రెడ్డి డా. చల్లా చెన్నారెడ్డిడా. ఆకుల వెంకటేశ్వరరావు డా. చొక్కం రామారావు
డా. వర అశోక్ కుమార్ డా. ఎం. భరద్వాజ్ కృష్ణ ఈ సన్మాన గ్రహీతలకు ముఖ్య అతిథులు మరియు ఫౌండేషన్ సభ్యులు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో చపాటి నారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు వెంకట రెడ్డి, నారాయణ రెడ్డి, రాజా రెడ్డి, సుబ్బారెడ్డి, తులసి సురేష్, దూల్ల రఘునాథ రెడ్డి, ఇండ్ల చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు

