మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్న వెటర్నరీ డాక్టర్లను ఘనంగా సన్మానించారు. జంతు సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణలో వారు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ శ్రీ ముత్యాల ప్రసాద్, మండల వైస్ ఎంపీపీలు శ్రీ సి. బాషా, శ్రీ చెన్ను రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుసంవర్ధక రంగానికి సేవలు అందించడం గర్వకారణమని, తమ బాధలను చెప్పలేని...