📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetగజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల దారుణ పరిస్థితి– రోగులు ఆగ్రహం..

గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల దారుణ పరిస్థితి– రోగులు ఆగ్రహం..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, ఏప్రిల్ 27, ప్రజావాణి

గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగానిర్లక్ష్యానికిగురయ్యాయని రోగులు,వాళ్ల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ అసిస్టెంట్లు తమ విధులను పక్కన పెట్టి గుంపులు గుంపులుగా నిలబడి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగుల వేదన ప్రకారం, ఆసుపత్రికి వచ్చే వాళ్ల కి సమయానికి పరీక్షలు చేయకపోవడం, చికిత్సను నిర్లక్ష్యంగా ఆలస్యం చేయడం సాధారణంగా మారిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సిబ్బంది స్పందన లేకపోవడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ, ఇక్కడి సేవలు పూర్తిగా పడిపోయాయని, బాధ్యతా రాహిత్యం పరాకాష్టకు చేరుకుందని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని నిర్లక్ష్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పరిస్థితి మరింత విషమించొచ్చని అక్కడ అడ్మిట్  అయినా పేషెంట్స్ మరియు చిన్నపిల్లల వార్డులో ఉన్న తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.