బెజ్జంకి, ఏప్రిల్ 27(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కింద నిర్మించిన కొత్త ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రేండ్ల ఆమని,అనిల్ నూతన గృహప్రవేశంలో గ్రామ సర్పంచ్ ముక్కిస కవిత, రత్నాకర్ రెడ్డి తో కలిసి బెజ్జంకి మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే,ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆశీస్సులతో గ్రామానికి వచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతోందని తెలిపారు. లక్ష్మిపూర్ గ్రామంలో ఇప్పటికే 22 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో కొన్ని పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించగా, మరికొన్ని త్వరలో పూర్తికానున్నాయని,
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గ్రామంలో దాదాపు 100 శాతం పూర్తికి చేరుకుంటోందని, ప్రతి అర్హులైన పేద కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే గ్రామానికి మరో 5 ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమని తెలిపారు. పార్టీ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు అందజేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణ రెడ్డి, దాచారం గ్రామ సర్పంచ్ బైరా మానస, రాజేందర్, ఒంటెల సంపత్ రెడ్డి, చిలువేరు రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.




