*హైకోర్టు తీరుపుతో ధర్మం గెలిచింది*
-టార్గెట్ల సీఎంకు చంప దెబ్బ
-కేసీఆర్ పై నిందలు వస్తే ప్రజలు తగిన నిందలు వస్తే ప్రజలే బుద్ధి చెప్తారు
-అందోలు బీఆర్ఏస్ నాయకులు
*మన ప్రజావాణి – అందోలు ప్రతినిధి:*
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోహైకోర్టు కొట్టేసినట్లు ప్రకటించడం అవినీతి, అగ్ర బాగా సరదాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున హైకోర్టులో వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసినట్లు ప్రకటించడంతో ధర్మం న్యాయం గెలిచిందంటూ బీఆర్ఎస్ నాయకులు అంటూ కోర్టు తీర్పును స్వాగతించారు. శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మసానిపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు పి.నారాయణ, లింగాగౌడ్, శంకరయ్య లు మాట్లాడుతూ ముందుచూపు, ఆలోచనతో నాటి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్నా ఉద్దేశంతో అద్భుతంగా కాలేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారన్నారు. యావత్ దేశమే మెచ్చుకున్న నేటి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరగాయంటూ ఆరోపణలు చేస్తూ నాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయించారని విమర్శించారు. కానీ ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో న్యాయం, ధర్మం గెలిచిందన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరగాయంటూ తప్పుడు నివేదికలతో కేసీఆర్ పై నిందలు వేశారని బీఆర్ఏస్ నాయకులు అరోపించారు. కాలేశ్వరం పై ఘోష్ కమిషన్ ను వేసి తప్పుడు నివేదికలతో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందన్నారు. దానిని హైకోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటిదని వారు అభివర్ణించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మా అధినేత కేసిఆర్ పై నిందలు వేస్తే సహించబోమని వారు హెచ్చరించారు. ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోవు రోజుల్లో తగిన రైతుల బుద్ధి చెప్తారని వారు వితం రాబోవు రోజుల్లో తగిన రైతుల బుద్ధి వచ్చేది వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారు జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంటు సత్యం, అందోల్ మాజీ ఎంపీపీ బాలయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు మొగులయ్య, రాజు, నర్సింలు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.


