📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం, పాల్గొన్న వేముల మహేష్ గౌడ్

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం, పాల్గొన్న వేముల మహేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ ఏప్రిల్ 24 (ప్రజావాణి) మేడ్చల్ జిల్లా, ఘాట్ కేసర్ సర్కిల్ పరిధి లో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, ఎంఎంసీ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్, ఘనపురం గ్రామ పైలట్ ప్రాజెక్ట్‌లో పనులు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో లింగాపురం గ్రామానికి చెందిన గుంటి నాగమణికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి ఈరోజు స్లాబ్ వేశారు. లబ్ధిదారుని ఆహ్వానం మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘనపురం గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేముల రాజు గౌడ్ హాజరై కొబ్బరికాయ కొట్టి స్లాబ్ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేద కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular