ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం, పాల్గొన్న వేముల మహేష్ గౌడ్

ఘట్కేసర్ ఏప్రిల్ 24 (ప్రజావాణి) మేడ్చల్ జిల్లా, ఘాట్ కేసర్ సర్కిల్ పరిధి లో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, ఎంఎంసీ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్, ఘనపురం గ్రామ పైలట్ ప్రాజెక్ట్‌లో పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లింగాపురం గ్రామానికి చెందిన గుంటి నాగమణికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి ఈరోజు స్లాబ్ వేశారు. లబ్ధిదారుని ఆహ్వానం మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ...