📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కవులకు ఘన సన్మానం

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కవులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) పోరుమామిళ్ల, ప్రపంచ పుస్తకపు దినోత్సవం సందర్భంగా పోరుమామిళ్లలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.మదర్ థెరీసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ సమీపంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది.కార్యక్రమానికి ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిత్తా రవి ప్రకాష్ రెడ్డి సూచనలు మేరకు రిటైర్డ్ ఉపాధ్యాయుడు పాలకొలను రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, ఉపాధ్యాయుడు తిరువీధి జయరాములు పాల్గొన్నారు.ప్రారంభంలో సరస్వతి దేవి విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన,ప్రార్థన గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం చైర్మన్ వాయిస్ ఓవర్ ద్వారా పుస్తకాల ప్రాముఖ్యత, జ్ఞాన విస్తరణలో వాటి పాత్రను వివరించారు. వక్తలు పుస్తకాల విలువను,చదువుల ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని వివరించారు.ఈ సందర్భంగా పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన కవులు బొల్లు రామ్మోహన్,గురుమూర్తి,యంబడి ఈశ్వర్‌లను గుర్తించి ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంస పత్రం, మెమెంటో,గౌరవ కండువా,మెడల్,బ్యాడ్జ్ అందజేశారు.కార్యక్రమంలో భాగంగా పుస్తక దానం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఫౌండేషన్ లైబ్రరీ అభివృద్ధి కోసం అతిథులు తమ ఇళ్ల నుంచి ఒకటి లేదా రెండు పుస్తకాలను అందజేశారు.ఒక్క పుస్తకం ఒక జీవితం మార్చగలదు” అనే సందేశంతో ఈ కార్యక్రమం కొనసాగింది. అదేవిధంగా యువతకు ప్రేరణగా నిలిచే స్వామి వివేకానంద ఆలోచనలను పరిచయం చేస్తూ ఆయన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తులసి సురేష్‌తో పాటు ఫౌండేషన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయులు,పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.