
శ్రీశైలం దేవస్థానంలోని
*హుండీల లెక్కింపు*
నంద్యాల జిల్లా శ్రీశైలం ఏప్రిల్ 23 (ప్రజావాణి)
ఈ రోజు (23.04.2026 ) జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి *రూ.4,83,22,554/-* లు నగదు రాబడిగా లభించింది.
కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత *33 రోజులలో* (21.03.2026 నుండి 22.04.2026 వరకు) సమర్పించడం జరిగింది.
అలాగే ఈ హుండీలో 162 గ్రాముల 200మిల్లీగ్రాముల బంగారు, 4కేజీల180 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 144 – యుఎస్ఏ డాలర్లు, 9870 – శ్రీలంక రూపి, 90 – యు.ఎ.ఇ దిర్హమ్స్, 120 – సౌదీరియాల్స్, 20 – ఇంగ్లాండు పౌండ్స్ , 151 – మలేషియా రింగిట్స్ , 25– ఆస్ట్రేలియా డాలర్లు, 30 – యూరోలు, 25– కెనడా డాలర్లు, 1 – కువైట్ దినార్, 30 – న్యూజిలాండ్ డాలర్లు మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.
ఈ హుండీల లెక్కింపును కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమములో పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు హుండీ లెక్కింపు పర్యవేక్షణలో పాల్గొన్నారు. హుండీల లెక్కింపులో సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
