స్పందించిన సివిల్ సప్లై అధికారులు
ప్రజావాణి వార్త కథనానికి స్పందన
స్పందించిన సివిల్ సప్లై అధికారులు
చెరువు మాదారం డీలర్ గెళ్లా వేణుపై 6ఏ కేసు నమోదు..?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
మూడు నెల రేషన్ బియ్యం పై మన ప్రజావాణి సమగ్ర కథనం అందించిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు దుద్దెపూడి చెరువు మాదారం రేషన్ డీలర్లు పై సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన వ్యవహారం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రేషన్ బియ్యం సప్లై చేయాల్సి ఉండగా డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యవహారంపై మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో ప్రత్యేక వార్తా కథనం కు సివిల్ సప్లై రెవిన్యూ అధికారులు స్పందించారు. ఆ మేరకు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రేషన్ కార్డుదారులకు సక్రమంగా రేష్మి బియ్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు జిల్లా ప్రజలు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.





