📄 ePaper
Tuesday, April 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జగనన్న కాలనీలను కాదు,ఊళ్ళు నిర్మించాడు - కాకాణి

జగనన్న కాలనీలను కాదు,ఊళ్ళు నిర్మించాడు – కాకాణి

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21),సర్వేపల్లి నియోజకవర్గం,వెంకటాచలం పంచాయతీ పరిధిలో నిర్మించిన జగనన్న కాలనీని వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు,స్థానికులతో కలిసి జగనన్న కాలనీ చంద్రబాబు కహానీ పేరుతో ఇంటి ఇంటికి తిరిగి జగనన్న హయాంలో నిర్మించిన ఇళ్లను పరిశీలించి సొంత ఇంటి కల నెరవేరిందని కాలనీవాసులతో సంతోషాన్ని పంచుకున్న మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా కాకాణి గోవర్ధన్ రెడ్డి.బాణాసంచా పేలుస్తూ మేళతాళాలతో  కాకాణి కి  ఘనస్వాగతం పలికిన జగనన్న కాలనీవాసులు ప్రతి గడపలో కాకాణికి అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికిన,జగనన్న గృహాల లబ్ధిదారులు-జగనన్న కాలనీ వాసులు, మహిళలతో కలిసి జగన్ మెహన్ రెడ్డి,చిత్ర పటానికి పాలాభిషేకం  నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కాకాణి పేదల సొంతింటి కల నెరవేర్చడమే జగనన్న లక్ష్యమన్న కాకాణి- పేదల సొంతింటి కలపై కూటమి సర్కార్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్న కాకాణి-పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి.పనిచేశారని పేర్కొన్న కాకాణి పేదల ఇళ్ల నిర్మాణం ​చంద్రబాబు హయాంలో భారం.జగనన్న పాలనలో వరంగా మారిందన్న కాకాణి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఒక యజ్ఞంలా సాగిందన్న జగన్ మోహన్ రెడ్డి  పేదల కోసం నిర్మించిన కాలనీల విషయం లో చంద్రబాబు అబద్ధపు కథలు చెబుతున్నాడు-జగనన్న గృహం చంద్రబాబు ద్రోహం పేరిట జగన్ ఇళ్లు నిర్మిస్తే వాటిని పూర్తి చేయకుండా చంద్రబాబు అడ్డుకున్న విధానాన్ని ప్రజలకు తెలియ చెబుతాం జగనన్న హయాంలో ఇళ్లు కాదు ఊళ్లు నిర్మించాం అని చెప్పడమే కాకుండా ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు ప్రజలకు తెలియ చెబుతున్నాం 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం అనేక విన్నపాలు చేసుకున్నా,కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు- ​ఇక్కడ నివసించే గిరిజనులు,పేదలు అనేక ఇబ్బందులు పడుతూ,సరైన వసతులు లేక చెట్ల క్రింద జీవిస్తూ,అనారోగ్యాల పాలవుతూ నరకయాతన అనుభవించారు.2019లో జగన్ మోహన్ రెడ్డి,ముఖ్యమంత్రి అయిన వెంటనే స్థానిక నాయకుల కృషితో పేదల సమస్యను జగన్మోహన్ రెడ్డి,దృష్టికి తీసుకెళ్ళి,అక్రమార్కుల చెరలో ఉన్న భూములను విడిపించి పేదలకు పంచడం జరిగింది నెల్లూరుకు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూములను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవాలని చూసినా,వాటిని అడ్డుకుని పేదలకు దక్కేలా చేశాం మొదటి విడతలో 7ఎకరాల స్థలాన్ని సేకరించి దాదాపు 260 ప్లాట్లను పేదలకు పంపిణీ చేశాం- ​మరింత మంది పేదలు స్థలాల కోసం కోరగా,రెండో విడతలో మరో 7ఎకరాలను సేకరించి,మొత్తం 14 ఎకరాల్లో 520 ప్లాట్లను సిద్ధం చేసి లబ్ధిదారులకు అందించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తుంటే నాడు ప్రతిపక్షంలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఓర్వలేకపోయాడు , ఇది దేవాదాయ శాఖ భూమి అంటూ కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకోవాలని చూశాడు- పేదవానికి మంచి జరగాలని భావించి ​అన్ని అడ్డంకులను,న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఈరోజు ఒక అందమైన ఊరినే నిర్మించి పేదల ఆత్మసంతృప్తికి కారణమయ్యాము- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు అందించిన ఇళ్ల పట్టాలు,నిర్మించిన ఇళ్ల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది చెన్నై-నెల్లూరు హైవే జాతీయ రహదారి పక్కనే ఉన్న అత్యంత విలువైన ప్రాంతంలో ఒక్కో పేదవాడికి దాదాపు 9 అంకణాల స్థలాన్ని కేటాయించాం దాదాపు రూ ఒక్కొక్కరికి 10 లక్షల విలువైన స్థలాన్ని జగనన్న ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చింది-ఒక్కో ఇంటికి జగనన్న ప్రభుత్వంలో రూ.1.80 లక్షల నగదు మంజూరు చేయడంతో పాటు,అదనంగా రూ.35,000 వడ్డీ లేని రుణంఉచిత ఇసుక ద్వారా మరో రూ.15,000 సాయం అందించి ఇల్లు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాం గిరిజన కుటుంబాలకు అదనపు ఆర్థిక సాయం​వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని పేద గిరిజన (ఎస్టీ), ఎరుకల కుటుంబాలకు గృహ నిర్మాణంలో వెన్నుదన్నుగా నిలిచాం- ప్రభుత్వం ఇచ్చే సాధారణ నిధులతో పాటు,సి.ఎస్.ఆర్ (CSR) నిధుల ద్వారా అదనంగా ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయలు నేరుగా కలెక్టర్ ఖాతా నుండి లబ్ధిదారులకు అందించాం ​జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్లు,వైరింగ్ సౌకర్యం కల్పించాం- ప్రభుత్వం మారిన తర్వాత జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన అటకెక్కింది,జగనన్న కాలనీలలో ​నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.అధికారులు ఇప్పుడు 30 మీటర్ల కంటే ఎక్కువ వైరు ఇవ్వడం లేదు,దీనివల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారు కూటమి నాయకులు కావాలనే ​సిమెంట్ రోడ్లు డ్రైనేజీ పనులు నిలిచివేశారు, రోడ్ల ప్రక్క దుర్గంధం వెదజల్లుతుంది,కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు  జగనన్న ప్రభుత్వంలో ​ఇళ్లు కట్టుకున్న పేదలకు రావాల్సిన దాదాపు రూ.60-70 వేల బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అబద్ధాలు మాని ​పేదల పట్ల వివక్ష చూపకుండా,తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేసి,మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తన 21 నెలల పాలనలో 5,50,000 ఇళ్లు నిర్మించామని చెప్పడం పచ్చి అబద్ధం,ఇటీవల నాయుడుపేటలో కూడా 2,50,893 ఇళ్లు ప్రారంభిస్తున్నానని చెప్పడం వాస్తవ విరుద్ధం-చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు “గోడకు సున్నం వేసినట్లునమ్మించే ప్రయత్నం చేస్తాడు,వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాకుండా,వారికి అవసరమైన అదనపు ఆర్థిక వనరులను కూడా సమకూర్చింది- జగన్ మోహన్ రెడ్డి,నాయకత్వంలోని ప్రభుత్వం గత ఐదేళ్లలో పేద ప్రజల ఆశలను నిజం చేస్తూ,వారికి సొంత ఇంటి కలని నెరవేర్చింది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,000 వేల లేఅవుట్లలో 22 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని జగనన్న ప్రభుత్వం చేపట్టింది,అందులో ఇప్పటికే 9 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయిభారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదల ఇళ్ల కోసం సుమారు ఒక లక్ష ఎకరాల భూమిని కేటాయించాం.72,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగించాం మరో 26,000 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం భారీ వ్యయంతో కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేసింది,కేవలం గృహ నిర్మాణ రంగంపైనే జగన్ గారి ప్రభుత్వం దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అందులో స్థలాల విలువ ₹50,000 కోట్లు కాగా,నిర్మాణానికి మరో ₹50,000 కోట్లు వెచ్చించాం ​గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసింది  కూటమి ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నా ఒక్క ఇళ్ళు నిర్మించి ఇవ్వకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ఇచ్చిన ఇళ్లను  తాము నిర్మించామని చెప్పుకొని’ప్లైవుడ్ నమూనా తాళాలు’ ఇచ్చి నాటకాలు ఆడారు- జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పేదవారు ఇల్లు నిర్మించుకొని సంతోషంగా గృహప్రవేశాలు చేశారు ఇవ్వడం చేతగాని వారు,ఇచ్చే మనసు లేని వారు. జగనన్న చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పేదవాడి సొంతింటి కల అత్యంత పారదర్శకంగా,తక్కువ ఖర్చుతో నెరవేరింది- టిట్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు 300 చదరపు అడుగుల ఇంటికి రూ.2.60 లక్షల అప్పు తీసుకోవాల్సి వచ్చేది,వడ్డీతో కలిపి అది సుమారు రూ.7.20 లక్షల భారం అయ్యేది- జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న కాలనీలో కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇళ్లను పేదలకు అందించారు,చంద్రబాబు హయాంలో గతంలో 365 చదరపు అడుగులకు రూ. 50,000 డిపాజిట్ కట్టాల్సి ఉండగా,జగన్ ప్రభుత్వం అందులో 50% రాయితీ ఇచ్చి కేవలం రూ.25,000 లకే రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది చంద్రబాబు హయాంలో 430 చదరపు అడుగుల ఇంటికి రూ.లక్ష డిపాజిట్ ఉండగా,దానిని రూ.50,000 కి తగ్గించి పేదలకు అండగా నిలిచాడు-చంద్రబాబు నాయుడు కల్లబొల్లి మాటలు చెప్పడం మానుకోవాలి,జగన్ చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయవద్దు ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు జగనన్నపై ఉన్న నమ్మకంతో మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆయనకు పాలాభిషేకాలు చేశారు- ​ఎన్ని జన్మలెత్తినా జగనన్న రుణం తీర్చుకోలేం” అని పేద వర్గాలు భావిస్తున్నాయి 2029లో మళ్ళీ జగనన్న రాజ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు,అమరావతి పేరుతో కేవలం కాలయాపన చేస్తున్నాడుపేదల ఇళ్ల నిర్మాణం విషయంలో జగన్ మోహన్ రెడ్డి  చిత్తశుద్ది అద్భుతం,ఈ రోజు లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే దానికి నిదర్శనం,జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి,హయాంలో  నిర్మించిన ఇళ్లను,స్థలాలను మీడియా సమక్షలో చూపిస్తాం,ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం కూటమి నాయకులు సిద్ధం గా ఉన్నారా సవాల్ విసురుతున్నా  కాకిలా కలకాలం బ్రతకడం కంటే,హంసలా ఆరు నెలలు బ్రతకడం మేలు,చంద్రబాబు ఎన్ని ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా పేదలకు చేసిందేమీ లేదు జగన్ ఐదేళ్లలోనే తన ముద్ర వేశాడు- ​జగన్ మోహన్ రెడ్డి, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు,లబ్ధిదారులు కోరుకుంటున్నారు,ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ వారికోసం పోరాడుతాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular