📄 ePaper
Tuesday, April 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

యాతవాకిళ్ళ గ్రామంలో సుమారు 50 ఎకరాల గడ్డివాములు దగ్ధం.

పశువుల నోటికాడి గడ్డి అగ్నికి ఆహుతి. ఆందోళనలో రైతులు.

  • ప్రజావాణి మఠంపల్లి. మండల పరిధిలోని యాతవాకిళ్ళ గ్రామంలో సోమవారం సాయంత్రం సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.ఈ ఘటనలో సుమారు యాభై నుండి అరవై ఎకరాల వరకు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. బాధితులు సూరోజు గోపయ్య తండ్రి శంబయ్య.సూరోజు నాగచారి.తండ్రి లక్ష్మణ చారి షేక్ సైదులు తండ్రి జాన్ షేక్ ఖాసీం తండ్రి సైదులు షేక్ లాల్ బీ భర్త జాన్అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, సాగర్ సిమెంట్ యాజమాన్యం నుండి వివిధ మండలాల నుంచి ఫైర్ ఇంజన్లు మొత్తం మూడు ఫైర్ ఇంజన్లు సమిష్టిగా పని చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అగ్నిమాపక చర్యలను అగ్నిమాపక అధికారి శ్రీ పి. సుబ్బరామి రెడ్డి . గ్రామ సర్పంచ్ శ్రీ కుక్కల కరుణ నాగరాజు. గ్రామ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది సహకారంతో సంఘటన స్థలంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, జెసిబి సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రస్తుతం అగ్ని నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. గ్రామస్తుల సమాచారం ప్రకారం, సమయానికి స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular