కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) ప్రొద్దుటూరులో.ఐఫోన్.మాయాజాలం.అక్రమార్కుల అడ్డాగా సెల్ పాయింట్ 1,C,సెల్ పాయింట్.అధికారులది కుంభకర్ణ నిద్ర.రెండవ ముంబైలో స్మగ్లింగ్ ఫోన్ల హల్చల్.కళ్లున్నా చూడలేని కబోదుల్లా పన్నుల శాఖ అధికారులు.నకిలీ మెరుపులు.ఆకర్షణీయమైన ఉచ్చు.బంగారు నగలకు,పట్టు వస్త్రాలకు పురిటిగడ్డ అయిన మన ప్రొద్దుటూరు,ఇప్పుడు విదేశీ దొంగచాటు చరవాణుల.స్మగ్లింగ్ మొబైల్స్.కు నిలయంగా మారుతోంది.ముఖ్యంగా యువత అమితంగా ఇష్టపడే.ఐఫోన్.లను ఎరగా చూపి సాగుతున్న ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.మార్కెట్లో కఠినమైన చట్టాలున్నా,అధికారుల అండదండలతో అక్రమార్కులు సామాన్యుడి జేబుకు కన్నం వేస్తున్నారు.సీ,పాయింట్ వన్,సెల్ పాయింట్ ల.లోపాయికారీ.దందా.ప్రొద్దుటూరులోని సెల్ పాయింట్.C.మరియు.1సెల్ పాయింట్ వంటి దుకాణాల్లో ఈ దోపిడీ బహిరంగంగా సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నోరు తీపి.కడుపు విషం.అన్న చందంగా,అతి తక్కువ ధరకే ఐఫోన్లు ఇస్తామంటూ ఈ దుకాణాల యజమానులు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.ఇతర దేశాల నుండి ఎటువంటి సుంకం చెల్లించకుండా దొంగచాటుగా తెచ్చిన ఈ చరవాణులను,నకిలీ రసీదులతో ప్రజల నెత్తిన రుద్దుతున్నారు.ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయల పన్నును ఎగవేస్తూ,అధికారుల.మామూళ్ల.జేబులు నింపుతున్నారన్నది ఇప్పుడు ఊరువాడ చర్చించుకుంటున్న సత్యం.ముద్ర వేయడంలో మేటి.పాత సీసాలో కొత్త సారాయి.ఇక్కడ జరిగే అసలు వింత ఏంటంటే.ఖరీదైన ఐఫోన్లను ముందే తెరిచి,వాడేసి,వాటి పనితీరును ప్రారంభించిన.యాక్టివేషన్..తర్వాత, అత్యంత నైపుణ్యంతో తిరిగి బాక్సులలో పెట్టి కంపెనీ ముద్ర.సీలింగ్.వేస్తున్నారు.పైన పటారం.లోన లోటారం.అన్నట్లు,వేలు పోసి మీరు కొంటున్న ఆ ఐఫోన్ అప్పటికే ఎక్కడో వాడబడిందని తెలిస్తే గుండె ఆగాల్సిందే.వీరు చేసే ఆ ముద్రణ విద్య చూస్తుంటే సాక్షాత్తు ఆ కంపెనీ ప్రతినిధులు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే..అధికారుల మౌనం.లంచాల మత్తులో రాజ్యమేలుతున్న అక్రమాలు.ప్రభుత్వం నుండి భారీగా వేతనాలు తీసుకుంటున్న పన్నుల శాఖ అధికారులు మాత్రం.నిమ్మకు నీరెత్తినట్లు.వ్యవహరిస్తున్నారు.ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు.రాష్ట్రమంతా సెల్ పాయింట్లపై దాడులు జరుగుతున్నా,ప్రొద్దుటూరులోని ఈ అక్రమ అడ్డాల వైపు కన్నెత్తి చూడటానికి వీరికి ఉన్న భయమేమిటి.సీ సెల్ పాయింట్ వన్ సెల్,పాయింట్ వంటి సంస్థల యజమానుల దగ్గర అధికారులు ఏమైనా లొంగిపోయారా.చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు,సామాన్యులు సర్వం కోల్పోయాక తనిఖీలు చేస్తారా.అధికారులారా.గుర్రానికి గడ్డి వేసి,ఆవు పాలు పితికినట్లు ఉంది మీ తీరు.ప్రజల సొమ్ముతో బతుకుతూ,బహిరంగంగా దోపిడీ చేస్తున్న ఈ అక్రమార్కులకు కొమ్ముకాయడం సిగ్గుచేటు.ఇది మీ నిర్లక్ష్యమా లేక అక్రమార్కులతో కుమ్మక్కై చేస్తున్నా విన్యాసమా.ప్రజలారా.మేల్కొనండి.కొనేవాడు వెర్రివాడైతే.అమ్మేవాడు అర్జునుడట.అని సామెత.ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి మోసపోకండి.. ముఖ్యంగా ఈ పేరున్న దుకాణాల్లో కొనేముందు ఆ ఐఫోన్ ముందే వాడబడిందా లేదా అన్న విషయాన్ని అంతర్జాలంలో క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి.ఇప్పటికైనా పన్నుల శాఖ అధికారులు తమ.కుంభకర్ణ నిద్ర.వీడి,వెంటనే ఈ దుకాణాలపై దాడులు చేయకపోతే,ప్రజలే మీ కార్యాలయాల ముందు నిలదీసే రోజులు దగ్గరలోనే.కాలం కలిసి తాడే పామై కరుస్తుంది.అని గుర్తుంచుకోండి.
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరులో..ఐఫోన్..మాయాజాలం.అక్రమార్కుల అడ్డాగా సెల్ పాయింట్ 1, C,సెల్ పాయింట్..అధికారులది కుంభకర్ణ నిద్ర..
ప్రొద్దుటూరులో..ఐఫోన్..మాయాజాలం.అక్రమార్కుల అడ్డాగా సెల్ పాయింట్ 1, C,సెల్ పాయింట్..అధికారులది కుంభకర్ణ నిద్ర..
0
10
RELATED ARTICLES
- Advertisment -



