శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) నెల్లూరు కార్పోరేషన్ లో టీడీపీ దోపిడీ పర్వం- చెట్లు నాటడం, నిర్వహణ పేరుతో భారీ అవినీతి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు కార్పోరేషన్లో చెట్ల పేరుతో దోపిడీ- మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అవినీతి- ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడి- ఇప్పటికీ ఆధారాలతో చర్చకు రెడీ- ఒక్కో చెట్టు నాటడానికి రూ.5 వేలు- ఒక్కో చెట్టు నిర్వహణకు రూ.12 వేలు- నెల్లూరు కార్పోరేషన్ నిధుల దుబారా- అడిగితే సీఎస్ఆర్ నిధులని బుకాయింపు- వీఆర్ హైస్కూల్ రెన్యువేషన్ లోనూ ఇదే తీరు- కార్పోరేషన్ని ధులు ఇచ్చేందుకు విఫలయత్నం- దొరికిపోయి సీఎస్ఆర్ నిధులిస్తామని కబుర్లు- మళ్లీ కార్పోరేషన్ నుంచి 10 కోట్లు తీసుకునే కుట్ర: వైఎస్సార్సీపీ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపణ నెల్లూరులో మున్సిపల్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు చెట్లు, స్కూళ్ల పేరుతో దోపిడీకి తెరలేపుతున్నారని, దీనికి కార్పోరేషన్ నిధుల్ని వాడుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.ఒక్కో చెట్టు నాటేందుకు 5 వేలు, దాని నిర్వహణకు 12 వేలు కార్పేరేషన్ నిధుల నుంచి ఖర్చుపెడుతున్నారని మేం ఆధారాలతో సహా ప్రశ్నిస్తే.. సీఎస్ఆర్ నిధులిస్తామని చెప్తున్నారని ఆక్షేపించారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధి విషయంలోనూ కార్పోరేషన్ నిధులు ఖర్చుపెట్టేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని, అప్పుడు సీఎస్ఆర్ నిధులిస్తామని చెప్పి తిరిగి కార్పోరేషన్ నుంచే రూ.10 కోట్లు తీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ లో జరుగుతున్న దోపిడీ, మంత్రి నారాయణ నేతృత్వంలో ఏవిధంగా తెలుగు తమ్ముళ్లు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారన్న విషయం మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బయటపెట్టారు. అప్పటి నుంచి ఎవరెవరినో ఉసిగొల్పి మాపై వ్యక్తిగత విమర్శలు చేయించడం,సబ్జెక్ట్ ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన ప్రతీ విషయం ఆధారాలతో మాట్లాడారు. అయినా టీడీపీ నేతలు సవాళ్లు చేయడం, మీసాలు మెలితిప్పడం,తొడలు కొట్టడం చేస్తున్నారు. మేం అడిగింది ఇవన్నీ చేయమని కాదు. మున్సిపల్ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతికి సంబంధించిన వివరాలు అన్నీ సేకరించి మేం బయటపెట్టాం. మీరు చెప్పే ప్రతీ మాటకూ సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాం.నెల్లూరులో 11వ డివిజన్ లో వెయ్యి చెట్లకు సంబంధించి 50 లక్షలకు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. అంటే చెట్టుకు ఐదు వేల రూపాయలు. అలాగే 13వ డివిజన్లోనూ వెయ్యి చెట్లకు 50 లక్షలు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. చెట్టుకు ఐదువేల చొప్పన వర్క్ ఆర్డర్ అంచనాలు తయారు చేశారు. 14వ డివిజన్లో 1800 చెట్లకు కోటీ 24 లక్షల రూపాయలు నిర్వహణకు వర్క్ ఆర్డర్ తయారు చేశారు.ఈ లెక్కన ఒక మొక్క నాటితే దాని నిర్వహణకు 12 వేల రూపాయలు ఖర్చుచేస్తున్నారన్న మాట.మున్సిపల్ కార్పోరేషన్ నిధుల్లో దోపిడీ చేస్తున్నారని అడిగితే సొంత నిధులు, సీఎస్ఆర్ నిధులని బుకాయిస్తున్నారు.
గతంలో మేయర్ కౌన్సిల్లో తీర్మానం చేసి మున్సిపల్ నిధులు వాడేందుకు ఇలా అనుమతి ఇచ్చారు. కానీ మున్సిపల్ కమిషనర్ మాత్రం డీపీఆర్ లేకుండానే ఈ ఖర్చు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. కార్పోరేషన్ నిధులతో పాటు ఇతర సీఎస్ఆర్ నిధులు కూడా తెచ్చి ఖర్చుపెడతామంటే మాకు అభ్యంతరం లేదు. సీఎస్ఆర్ నిధులైనా డీపీఆర్ కచ్చితంగా ఉండాల్సిందే. అలాగే నిధులు కలెక్టర్ ఖాతాలో జమ చేయాలి. కలెక్టర్ డీపీఆర్, ఇతర విషయాలు పరిశీలించి అప్పుడు నిధులు విడుదల చేయాలి. మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారని డీపీఆర్ లేకుండా ఖర్చు చేస్తామంటే కుదరదు.ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న నిధులపై మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించడం వల్లే మీ దోపిడీ బయటపడింది. దోపిడీ బయటపడింది కాబట్టి మీరు సొంత నిధులు ఖర్చుపెడుతున్నాం అంటున్నారు. దానికైనా జవాబుదారీతనం ఉండాల్సిందే. కమిషనర్ కు దీంతో ఏం సంబంధం ? డొంక తిరుగుడు సమాధానాలివ్వడం, తీర్మానాలు ఆమోదించుకోవడం, అడిగితే ఎదురుదాడి చేయడం వీళ్లకు అలవాటుగా మారింది. మంత్రి నారాయణ చెట్లను దొంగిలించిన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు, నిన్న మరో వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఫొటోలు పెట్టుకుని చెట్లు తీసేశారని ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీకి అంత దిగజారాల్సిన అవసరం లేదు. అసత్య ప్రచారాలు చేసే వారి మీద చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ చెప్తున్నారు. అసత్య ప్రచారాల మీద కాదు నారాయణ మీద ముందు చర్యలు తీసుకోవాలా, మీ దోపిడీని ప్రశ్నించిన మా వాళ్ల మీద కేసులు పెట్టాలా అన్నది మీరే తేల్చుకోండి. సీఎస్ఆర్ నిధుల విడుదల మీద కూడా ఓ ప్రొసీజర్ ఉంది. కంపెనీలు కూడా ఇష్టారాజ్యంగా సీఎస్ఆర్ నిధులు ఇవ్వకూడదు. ప్రభుత్వాధికారులు వేసే అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వ నిధులకు తోడు సీఎస్ఆర్ నిధులు కూడా ఖర్చుపెట్టే వెసులుబాటు ఉంటుంది.ఈ మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాగే నిబంధనలకు విరుద్దంగా మారిటైమ్ బోర్డు నిధులు అడుగుతున్నారు. తమరి చిలకొట్టుడు కోసమేగా ఈ నిధులు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నేలటూరు ఫిషింగ్ జెట్టీ కోసం 25 కోట్ల నిధులు ఇవ్వాలని కృష్ణపట్నం పోర్టు కంపెనీని కోరాం.దానికి అన్ని అనుమతులు ఇప్పించాం. డ్రెడ్జింగ్ తప్ప మిగతా పనులన్నీ పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు మిగిలిన పనుల కోసం మారిటైమ్ నిధులు అడుగుతున్నారంటే అవినీతి కోసమే.ఇప్పటికైనా మున్సిపల్ కార్పోరేషన్ పనుల విషయంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు, సీఎస్ఆర్ నిధులపై పారదర్శకంగా వివరాలు బయటపెట్టండి. చెట్టుకు 12 వేల రూపాయలంటే నగర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పటికే అన్ని చోట్లా దోచుకుంటున్నారు. ఇప్పుడు చెట్ల మీద కూడా దోపిడీకి దిగడం దారుణం. రేపు దీని మీద విచారణ జరిగితే అధికారుల్ని ఎవరూ కాపాడలేరని గుర్తుంచుకోవాలి.నగరంలో చెట్లు నాటుతుంటే అది చూసి ఓర్వలేక కడుపుమండి మాట్లాడుతున్నామని నారాయణ వంటి చదువుకున్న వ్యక్తి, టీచర్ గా పనిచేసిన వ్యక్తి చెప్తుంటే బాధనిపిస్తోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండమని మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రజల నుంచి వివిధ రూపాల్లో పన్నులు వేసి వసూలు చేసిన డబ్బులు ఇలా ఇష్టారాజ్యంగా పంచి పెడతామంటే మాత్రం చూస్తూ ఊరుకోం. అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజల కోసం పోరాడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. చెట్ల పేరుతో జరుగుతున్న దోపిడీ ఏ డివిజన్లో, ఏ సబ్ కాంట్రాక్టర్ కు, ఎన్ని చెట్ల కోసం, ఎంత మొత్తాలు విడుదల చేశారో వివరాలు మేం బయటపెట్టాం. ఒక్కో చెట్టు నాటడానికి 5 వేలు, నిర్వహణకు ఒక్కో చెట్టుకు 12 వేలు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నగరంలో 14800 చెట్లు నాటుతున్నాం, వాటికి 8 కోట్ల 20 లక్షలు ఖర్చవుతుందని నారాయణ చెప్పారు. ఈ లెక్కన ఒక్కో చెట్టుకు రూ.5540 ఖర్చవుతుంది. అనుమతి తీసుకుంది రూ.5 వేలకు, టీడీపీ నేతలేమో రూ.3700 అంటున్నారు, మంత్రి నారాయణ రూ.5540 ఖర్చవుతుందని చెప్తున్నారు.నిన్న నారాయణ ఓఏస్డీ వాట్సాప్ గ్రూపుల్లో 10 వేల చెట్లకు 5 కోట్ల రూపాయలు అని మెసేజ్ లు పంపారు. చెప్పేది అబద్దం కాబట్టే ఒక్కో చోట ఒక్కో లెక్క చెప్తున్నారు. మంత్రి నారాయణ మళ్లీ ఇవాళ టెలీకాన్ఫెరెన్స్ లో 10 వేల చెట్లు 5 కోట్లు అవుతుంది, అంత మొత్తం సాధ్యం కాదని సీఎస్ఆర్ నిధులు, సొంత నిధులు కలిపి ఇస్తానంటున్నారు. మరోవైపు కమిషనర్ మాత్రం ఒక్కో చెట్టుకు 3500 నుంచి 4 వేలు ఖర్చవుతుందని, ఒక్క రూపాయి కూడా కార్పోరేషన్ నిధులు ఇవ్వలేదంటున్నారు. ఇలా తలో లెక్క చెప్తున్నారు. ఇదంతా మోసం కాదా చెప్పాలి. నారాయణకు ఏమాత్రం జవాబుదారీ తనం లేకపోవడం వల్లే నెల్లూరులో చెట్ల విషయంలో ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు. నెల్లూరు నగరంలో వీఆర్ హైస్కూల్ రెన్యువేషన్ కోసం 15 కోట్ల సీఎస్ఆర్ నిధులు తెచ్చి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గతలో చెప్పారు. ఈ కాలేజీని కార్పోరేషన్ పరిధిలోకి తెచ్చి దానికి గుదిబండలా మార్చారు. ఎయిడెడ్ లోనే కొనసాగించడమే లేక ప్రభుత్వం తీసుకోవడమే చేసి ఉంటే రెన్యువేషన్ సింపుల్ గా పూర్తయ్యేది. వీఆర్ హైస్కూల్ అభివృద్ధి కోసం 5 కోట్లు అవసరమని కమిషనర్, మేయర్ సంతకాలు చేసి అనుమతులు ఇచ్చారు. వాహనాల కోసం మరో 5 కోట్లు కావాలన్నారు. ఒక్కో వ్యాన్ 30-32 లక్షలకు వస్తుంటే, 50 లక్షల బడ్జెట్ పెట్టారు. సీఎస్ఆర్ నిధులని చెప్పి మళ్లీ కార్పోరేషన్ నుంచి 10 కోట్లు తీసుకునేందుకు కుట్ర చేశారు. మేం ప్రశ్నిస్తే కార్పోరేషన్ నిధుల నుంచి తీసుకోనని చెప్పి నారాయణ యూటర్న్ చేసుకున్నారు. ఇది అవినీతి, మోసం మాత్రమే కాదు ఆర్ధిక కుట్రే అవుతుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తేల్చిచెప్పారు



