📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చండి. "బడి పిలుస్తోంది" కార్యక్రమంలో ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చండి. “బడి పిలుస్తోంది” కార్యక్రమంలో ఉపాధ్యాయులు

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) కలసపాడు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చండి.”బడి పిలుస్తోంది” కార్యక్రమంలో ఉపాధ్యాయులు.నాణ్యమైవిద్యతో పాటు, క్రమశిక్షణ,నైతికవిలువలు,పెద్దలపట్ల గౌరవం లాంటి విలువలు నేర్పే,సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని మండల విద్యాశాఖాధికారి ఎస్.మస్తాన్ వళి మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.”బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా శనివారం కలసపాడులోని ఆదర్శప్రాథమిక పాఠశాల మరియు ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓతో కలిసి ప్రభుత్వపాఠశాల ప్రాధాన్యతను వివరిస్తూ,పిల్లలను చేర్పించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మస్తాన్ వళి మరియు ఉపాధ్యాయులు శేఖర్ బాబు,రమణారెడ్డి, చెన్నయ్య,బాలరాజునాయక్ లు మాట్లాడుతూ,మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తే వారికి చదువు చెప్పే బాధ్యత మాది అని హామీ ఇవ్వడంతో పాటు,ప్రభుత్వ పాఠశాలల యందు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు ఉచిత విద్యతోపాటు,ఆహ్లాదకరమైన తరగతి గదులు,నాణ్యమైన సన్న బియ్యంతో కూడిన రుచికరమైన మధ్యాహ్నం భోజనం,మంచి పాఠ్యపుస్తకాలు,వర్క్ బుక్కులు, బ్యాగులు,యూనిఫాం,బూట్లు,రకరకాల ఆట వస్తువులతో పాటు, గ్రంథాలయ పుస్తకాలు,విలువైన బోధనోపకరణాలు,తల్లికి వందనం లాంటి ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉన్నాయన్నారు.శుభ్రమైన తాగునీరు,పరిశుభ్రమైన మరుగుదొడ్లు,వాటిని శుభ్రపరచడానికి ఆయా లాంటి ఎన్నో సదుపాయాలు ఉన్నందున ఆలోచించి,పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి,వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు చౌడమ్మ,రహమత్ బీ,తల్లిదండ్రులు పాల్గొని,పదిమంది పిల్లలను అడ్మిషన్ చేయించడమైనది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.