📄 ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా లక్ష్మీ కిరణ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు..

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా లక్ష్మీ కిరణ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్ ఏప్రిల్ 15 ప్రజావాణి

జిల్లా పరిపాలనలో కీలకమైన బాధ్యతల మార్పిడి నేపథ్యంలో, బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా లక్ష్మీ కిరణ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారుల సమక్షంలోసరళంగానిర్వహణ జరిగింది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం, లక్ష్మీ కిరణ్, జిల్లా కలెక్టర్ కె. హైమావతి,ని కలెక్టర్ ఛాంబర్‌లోమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా భూ భారతి పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై చర్చించారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలనే దిశగా అవసరమైన చర్యలపై అభిప్రాయాలనుపంచుకున్నారు.అనంతరం అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అబ్దుల్ హమీద్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకుని పరస్పర సహకారంతో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.జిల్లా పరిపాలనలో సమన్వయం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్,సంకల్పం వ్యక్తం చేసినట్టు తెలిసింది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular