📄 ePaper
Thursday, July 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ నియోజకవర్గం లో రేషన్ బియ్యం దందా: పేదల బియ్యం పక్కదారి..

బద్వేల్ నియోజకవర్గం లో రేషన్ బియ్యం దందా: పేదల బియ్యం పక్కదారి..

📰 Generate e-Paper Clip

వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15)బద్వేల్ నియోజకవర్గం అక్రమ రేషన్ బియ్యం రవాణాకు ప్రధాన కేంద్రంగా మారుతోంది.రేషన్ కార్డుదారుల వద్ద నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి, వాటిని పాలిష్ పట్టించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాల ఆగడాలు మితిమీరుతున్నాయి.బద్వేల్ నియోజకవర్గం లో’కొంతమంది వ్యక్తులు పోటీపడి రేషన్ బియ్యం దందా నిర్వహిస్తున్నారు.అని స్థానిక ప్రజల గుసగుసలు.బద్వేల్ నియోజకవర్గం ప్రాంతాల్లో దళారులు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి ₹10 నుండి ₹15 రూపాయలకు కిలో బియ్యాన్ని సేకరిస్తున్నారు.కొంతమంది డీలర్లు తూకంలో కూడా అవకతవకలు జరుగుతున్న పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలా సేకరించిన బియ్యాన్ని అర్ధరాత్రి వేళల్లో ఆటోలు మరియు టాటా మ్యాజిక్ వాహనాల ద్వారా గొడవనుకు తరలిస్తున్నారు.ఈ బియ్యాన్ని పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు అని బద్వేలు ప్రజల గుసగుసలు.అధికారులు నిఘా వేసినా కూడా దొంగ దారుల్లో తమ చేతివాటం ప్రదర్శిస్తున్న రేషన్ మాఫియా.వీటిని అరికట్టే వారు లేరా.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular