📄 ePaper
Friday, April 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దివ్యాంగ శక్తి బస్సు పాసుల పంపిణీ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ చమర్తి...

దివ్యాంగ శక్తి బస్సు పాసుల పంపిణీ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు

📰 Generate e-Paper Clip

రాజంపేట ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15)రాజంపేట వీరబల్లి దివ్యాంగ శక్తి బస్సు పాసుల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజుబాబు.దివ్యాంగులకు ఇచ్చిన వరం దివ్యాంగ శక్తి.బాబు దారి చూపిస్తే,దారిలోని చిన్న చిన్న గులకరాళ్లను తొలగించి సహాయాన్ని సంపూర్ణం చేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి వద్దకే దివ్యాంగులకు బస్ పాసుల పంపిణీ ఒక పాస్ కు ₹100 చొప్పున 2000 మందికి పైగా లబ్ధిదారుల కొరకు ఆర్టీసీ అధికారులకు చెల్లింపు దివ్యాంగులకు సమయం తో పాటు వ్యయ ప్రయాసలు తగ్గించాం.దివ్యాంగులతో పాటు సహాయకుడికి కూడా 50% రాయితీతో ప్రయాణ అవకాశం.కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన దివ్యాంగ శక్తి పథకం దివ్యాంగుల పాలిట వరంగా మారింది.రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు ప్రత్యేక చొరవ చూపి నియోజకవర్గ వ్యాప్తంగా దివ్యాంగులకు తన సొంత నిధులతో ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకొని దివ్యాంగులకు బస్సు పాసుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఒక్కో బస్సు పాస్ కు ₹100 చొప్పున 2000 మందికి పైగా లబ్ధిదారులకి సొంత నిధులతో ఆర్టీసీ అధికారులు చెల్లింపు చేశారు.నేడు వీరబల్లి మండలంలో పర్యటిస్తూ బస్సు పాసుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థ సేవ చేస్తున్న చంద్రబాబు గారు దారి చూపిస్తే దారిలోని చిన్నచిన్న గులకరాళ్ళను తొలగించి సహాయాన్ని సంపూర్ణం చేశాం అన్నారు.నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు దివ్యాంగుల ఇంటి దగ్గరికి వెళ్లి పాసులకు కావాల్సిన పేపర్లను స్వయంగా సేకరించారన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకుని దివ్యాంగులకు పాసులు సకాలంలో అందేలా పనిచేయడం జరిగింది అన్నారు.దివ్యాంగులకు సమయముతో పాటు వ్యయ ప్రయాసలు తగ్గించామన్నారు.దివ్యాంగులతో పాటు ప్రయాణం చేసే సహాయకుడికి టికెట్ లో 50% రాయితీ ఇవ్వడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో దివ్యాంగులు,కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular