ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) ఇన్చార్జి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కనుసైగలోనే 43వ డివిజన్లో అక్రమ నిర్మాణం ఇన్చార్జి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ని కలిసి మేమేదో కొంత మొత్తములో అప్పచెప్పి నిర్మాణం వేసుకున్నామని నిర్మాణదారుడు
వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.43వ డివిజన్ ఎంఐజి బ్లాక్ నెంబర్ 6 లో కామన్ గా వదిలిన స్థలాన్ని స్లాబ్ పెంచి నిర్మాణం చేపట్టారు.ఈ మధ్యకాలంలో హెచ్ బి కాలనీ లో కామనగా వదిలిన స్థలాలను సైతం పెంచుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఇంచార్జి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు మరియు ప్లానింగ్ సెక్రటరీలకు ఆదాయ మార్గాలుగా మారాయి.హెచ్ బి కాలనీలో కామనగా వదిలిన స్థలంలో అక్రమ నిర్మాణం చేసుకుంటూ ఇన్చార్జి బిల్డింగ్ ఇన్స్పెక్టర్, ప్లానింగ్ సెక్రటరీ మేనేజ్ చేసుకొని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా అక్రమ నిర్మాణాదారులు వద్ద భారీగా డబ్బులు తీసుకొని అక్రమ నిర్మాణానికి తెర లేపుతున్నారు ముఖ్యంగా ఏసీబీ అధికారులు మాత్రం ఇన్చార్జి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ప్లానింగ్ సెక్రటరీల ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తే తెలుస్తుంది మీరు అక్రమ సంపాదనతో ఏమేమి కొంటున్నారని.



