📄 ePaper
Friday, April 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రామకీర్తన హత్యకు సహకరించిన వారినీ అరెస్టు చేయాలి. బాధితుల నిరసన ఆందోళన పై అక్రమకేసులు ఎత్తివేయాలి..సిపిఎం,...

రామకీర్తన హత్యకు సహకరించిన వారినీ అరెస్టు చేయాలి. బాధితుల నిరసన ఆందోళన పై అక్రమకేసులు ఎత్తివేయాలి..సిపిఎం, ప్రజా సంఘాల,

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) కాజీపేట మండలం,అగ్రహారం గ్రామంలోని ప్రేమోన్మాది ఆవుల వెంకటేష్ చేతిలో తీవ్ర హత్యకు గురైన రామకీర్తన.హత్యకు సహకరించిన వారినీ అరెస్టు చేయాలి. బాధితుల నిరసన ఆందోళన పై అక్రమకేసులు ఎత్తివేయాలి.రామకీర్తన హత్యపై నిష్పక్షపాత విచారణ జరగాలి.బాధితురాలి కుటుంబసభ్యులను ఓదార్చి అండగా నిలబడతామన్న ఐద్వా,సిపిఎం,ప్రజా సంఘాల,వామపక్షాల నాయకులు.ఐద్వా”మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రమ్మ డిమాండ్.2026 ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు,కాజీపేట మండలం,అగ్రహారం గ్రామంలోని ప్రేమోన్మాది ఆవుల వెంకటేష్ చేతిలో తీవ్ర హత్యకు గురైన రామకీర్తన కుటుంబ సభ్యులను కలిసి జరిగిన సంఘటన విషయాలు తెలుసుకుంటున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్,సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీ.శివకుమార్,”ఐద్వా” జిల్లా అధ్యక్షులు ఐ.ఎన్.సుబ్బమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ముంతాజ్ బేగం,సరస్వతి,జమీల,మోక్షమ్మ, ప్రేమ,విజయ కుమారి,సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షులు కే.శ్రీనివాసులురెడ్డి,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్,జేవివీ సమత మహిళ విభాగం జిల్లా నాయకులు సరస్వతి, కామేశ్వరమ్మ సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీదేవి,రాజామణి,ఏ.పీ.మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.విజయలక్ష్మి,రవణమ్మ,మేరీ,ఏఐఎస్ఎఫ్ నాయకులు చంద్ర,సిపిఐ నాయకులు శ్రీరాములు, కాజీపేట సిపిఎం నాయకులు వెంకటసుబ్బయ్య,రాజశేఖర్ రెడ్డి,భీ.మటం సిపిఎం నాయకులు సునీల్, పత్రికా విలేకరులు తదితరులు ఉన్నారు.భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రమ్మ మాట్లాడుతూ.ఈనెల తొమ్మిదవ తేదీ ఉదయం కడప జిల్లా ఖాజీపేట మండలం అగ్రహారం నందు ఇంటర్ చదువుతున్న రామకీర్తన అనే బాలికను సదరు మండలం ఆంజనేయకొటాలు గ్రామస్తుడు ఆవుల వెంకటేష్ గంజాయి,డ్రగ్స్ వ్యసనపరుడని గ్రామస్తులు తెలిపినట్లు వారన్నారు. హత్యకు సహకరించిన వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.బాధితుల కుటుంబంకు అండగా నిలబడి నిరసన తెలియజేసిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించడం సరైన చర్య కాదని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular