సిద్దిపేట్, ఏప్రిల్ 14, ప్రజావాణి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించబడుతున్న రహదారి భద్రత కార్యక్రమం, అరైవ్ – అలైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించబడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలకు హాజరైన ప్రజానికంచే రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. దీనితోపాటు జిల్లాలో రోజురోజుకీ పెరుగుతున్నా రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కె హైమావతి , అడిషనల్ కలెక్టర్ హమీద్, సిద్దిపేట సి పి రష్మీ పెరుమాళ్ ,సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు అయిన పీ శంకర్ నారాయణ మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ షేక్ నజీర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ రవీందర్, విక్టోరియా, మరియు జయలక్ష్మి హోంగార్డ్స్ అష్రాఫ్ రామేశ్వరులు పాల్గొన్నారు .

