📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కీసర టోల్ ప్లాజా ఘోర ప్రమాదం తప్పు ఎవరిది ? యాజమాన్యం నిర్లక్ష్యం బట్టబయలు !.ఏఐవైఎఫ్...

కీసర టోల్ ప్లాజా ఘోర ప్రమాదం తప్పు ఎవరిది ? యాజమాన్యం నిర్లక్ష్యం బట్టబయలు !.ఏఐవైఎఫ్ కరిసే.మధు

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)నందిగామ నియోజకవర్గం,కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఒక సాధారణ ప్రమాదం కాదని ఇది స్పష్టమైన వ్యవస్థ వైఫల్యంమనీ, యాజమాన్య నిర్లక్ష్యం,మరియు ప్రాణాల పట్ల ఉన్న బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష ప్రత్యక్షమని ఏఐవైఎఫ్ కరిసే.మధు తెలియపరుస్తారు.ఒకే దిశగా వెళ్తున్న వాహనాలకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసినట్టు చూపిస్తూ,భద్రత ఉందనే నాటకం ఆడుతున్న టోల్ ప్లాజా యాజమాన్యం అసలు వాస్తవానికి ఎంత దూరంగా ఉందో ఈ ప్రమాదం బట్టబయలు చేసింది.ఒక లైన్‌లో వెళ్తున్న భారీ లారీ టాంకర్ అదుపు తప్పి పక్క లైన్‌లో ప్రయాణిస్తున్న కారుపై పడటం అనేది సాధారణ డ్రైవర్ తప్పిదంగా తీసుకునే విషయం కాదు ఇది పూర్తిగా భద్రతా వ్యవస్థల వైఫల్యం.టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలకు ప్రత్యేక నియంత్రణ ఎక్కడ వేగ నియంత్రణ చర్యలు ఎందుకు అమలు కాలేదు.లైన్ల మధ్య భద్రతా అంతరం ఎందుకు లేకపోయింది ?అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు ఒకదానిపై మరొకటి పడకుండా ఉండే రక్షణ గార్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదు.టోల్ వసూలు విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించే యాజమాన్యం,భద్రత విషయంలో ఎందుకు పూర్తిగా చేతులెత్తేసింది.ప్రజల నుంచి డబ్బులు తీసుకోవడమే బాధ్యతగా భావించి,వారి ప్రాణాలను పట్టించుకోకపోవడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం.ఇది కేవలం ఒక ప్రమాదం కాదు.ఇది నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదకర హత్యకు సమానం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ మళ్లీ జరుగుతున్నా,యాజమాన్యం మార్పు లేకుండా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.ఈ ప్రమాదానికి అసలు బాధ్యత ఎవరు వహిస్తారు ? లారీ డ్రైవర్‌ను బలి పశువుగా చేసి కేసు ముగించేస్తారా.లేక టోల్ ప్లాజా యాజమాన్యపు బాధ్యతను కూడా విచారణలోకి తీసుకుంటారా ?ప్రాణాలు పోయాక చర్యలు తీసుకోవడం కాదు, ముందే భద్రత కల్పించడం యాజమాన్యపు కర్తవ్యం.కానీ కీసర టోల్ ప్లాజా వద్ద మాత్రం అది పూర్తిగా విఫలమైంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుని,ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ,టోల్ ప్లాజా నిర్వహణపై సమగ్ర విచారణ జరపాలి లేనిపక్షంలో, ఈ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణం ప్రమాదంలోనే ఉంటుందని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కరిసే.మధు తెలియపరిచారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular