కీసర టోల్ ప్లాజా ఘోర ప్రమాదం తప్పు ఎవరిది ? యాజమాన్యం నిర్లక్ష్యం బట్టబయలు !.ఏఐవైఎఫ్ కరిసే.మధు

ఎన్టీఆర్జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)నందిగామ నియోజకవర్గం,కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఒక సాధారణ ప్రమాదం కాదని ఇది స్పష్టమైన వ్యవస్థ వైఫల్యంమనీ, యాజమాన్య నిర్లక్ష్యం,మరియు ప్రాణాల పట్ల ఉన్న బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష ప్రత్యక్షమని ఏఐవైఎఫ్ కరిసే.మధు తెలియపరుస్తారు.ఒకే దిశగా వెళ్తున్న వాహనాలకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసినట్టు చూపిస్తూ,భద్రత ఉందనే నాటకం ఆడుతున్న టోల్ ప్లాజా యాజమాన్యం అసలు వాస్తవానికి ఎంత దూరంగా ఉందో ఈ ప్రమాదం బట్టబయలు చేసింది.ఒక లైన్‌లో వెళ్తున్న భారీ లారీ టాంకర్ అదుపు...