📄 ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarముదిమాణిక్యంలో అంబేద్కర్ సంఘం నూతన కమిటీ

ముదిమాణిక్యంలో అంబేద్కర్ సంఘం నూతన కమిటీ

📰 Generate e-Paper Clip

అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా బోయిని కొమురయ్య ఏకగ్రీవ ఎన్నిక

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో అంబేద్కర్ సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం నిర్వహించిన గ్రామ శాఖ సమావేశంలో సంఘం అధ్యక్షుడిగా బోయిని కొమురయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా కట్ల శంకరయ్యను ఎంపిక చేశారు.ప్రధాన కార్యదర్శులుగా జేరిపోతుల కుమార్, ఎల్లయ్యలను నియమించగా, కార్యవర్గ సభ్యులుగా కట్ల సంపత్, జేరిపోతుల పోచయ్య, బోయిని లక్ష్మణ్, కొల పోశయ్య, కొల శ్రీనివాస్, బోయిని బాలయ్య, బోయిని కృష్ణ తదితరులను ఎన్నుకున్నారు.ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలను గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. నూతన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు కట్ల సుధాకర్, బోయిని శ్రీనివాస్, బోయిని రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular