📄 ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సుప్రీం కోర్టు ఎస్సీ హోదాపై ఇచ్చిన తీర్పు పట్ల ఆందోళన. సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలో దళిత...

సుప్రీం కోర్టు ఎస్సీ హోదాపై ఇచ్చిన తీర్పు పట్ల ఆందోళన. సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలో దళిత వర్గాలలో అలజడి. . కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలి.

📰 Generate e-Paper Clip

కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10) బద్వేల్ సుప్రీం కోర్టు ఎస్సీ హోదాపై ఇచ్చిన తీర్పు పట్ల ఆందోళన.సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలో దళిత వర్గాలలో అలజడి.కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలి.కెవిపిఎస్ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం.దళిత క్రైస్తవ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కెవిపిఎస్ బద్వేల్ పట్టణ కార్యదర్శి సగిలి రాయప్ప అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జకరయ్య, జ్యోతిరావు పూలే రాజ్యాధికార సమితి నాయకులు ముండ్లపూడి పిచ్చయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని,డి హెచ్ పి ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడిగే వెంకటరమణ లు.మాట్లాడుతూ.సుప్రీం కోర్ట్ ఎస్సీ హోదా మరియు మత మార్పిడి అంశంపై ఇచ్చిన తాజా తీర్పు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఎస్సీ హోదాను మతంతో అనుసంధానం చేయడం పూర్తిగా అభ్యంతరం గౌరవ న్యాయస్థానం ఈ తీర్పును వెంటనే రివ్యూ చేయాలని కోరుతున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి మతానికి రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొనాలి రిజర్వేషన్లను ఎందుకు వచ్చాయో గుర్తు చేసుకోవాలి శతాబ్దాలుగా దళితులు ఎదుర్కొంటున్న అంటరానితనం సామాజిక వివక్ష ఆర్థిక విద్య వెనుకబాటుతనం నుండి బయటపడింది రాజ్యాంగం ప్రత్యేక హక్కుగా రిజర్వేషన్లను కల్పించింది ఇవి మతానికి సంబంధించినవి కాదు ఇవి సామాజిక న్యాయం సాధించడానికి తీసుకున్న చారిత్రక చర్యలు మన దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉంది ఎవరైనా ఏ మతాన్ని అనుసరించవచ్చు కానీ అదే స్వేచ్ఛ దళితులకు వర్తించదా మతం మారితే హోదా రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుంది ఇది స్పష్టమైన అన్యాయం ఒకవైపు మత స్పేక్షను కల్పిస్తూ మరోవైపు హక్కులను కత్తిరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం దళితులు ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు అనే తీర్పు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది ఈ తీర్పును అమలు చేయొద్దని సుప్రీంకోర్టును కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి సమాజంలో ఇంకా దళితులపై వివక్ష కొనసాగుతుంది వారు మతం మార్చుకున్న తగ్గదు కాబట్టి మతాన్ని ఆధారంగా చేసుకొని హక్కులను నిరాకరించడం పూర్తిగా తప్పు ఈ తీర్పు హిందుత్వ శక్తులకు ఆయుధంగా మారి దళితులపై దాడులు మరింత పెరగడానికి దారి తీసే ప్రమాదం ఉంది అంటరానితనాన్ని నిర్మించడానికి వచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మీరుగాడ్చే చర్యలను అంగీకరించబడబోమని సామాజిక న్యాయం స్థానంలోకి మనుధర్మాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిపై అందరిని కలుపుకొని కార్యచరణ చేస్తామన్నారు టిడిపి పోటీలు ప్రభుత్వం అసెంబ్లీలో ఈ అంశంపై తీర్మానాలు ఆమోదించి కేంద్రానికి రాజ్యాంగ సవరణ కోసం పంపాలి సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చక పోవడం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దళితులను గుడిలోకి అనుమతించని పరిస్థితులు ఉన్నాయి ఈ కారణంగానే వారు చర్చిలకు వెళ్తున్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతుంది దళితులు మతం మార్చుకున్న వివేక్షిత పోదు కాబట్టి సామాజిక న్యాయం సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులు లను ఎస్సీ జాబ్స్ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈనెల 18వ తేదీన అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు దళిత సంఘాలు అందరూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకావాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్షులు ఎస్కే మస్తాన్, షరీఫ్ డాక్టర్ గ్లోరీ సెడ్రక్,ఐద్వ మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు గంప అనంతమ్మ, బీసీ నాయకుడు సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular