📄 ePaper
Friday, April 10, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarసి-క్యాట్ ఫలితాల్లో చాణక్య విద్యార్థుల ప్రభంజనం!

సి-క్యాట్ ఫలితాల్లో చాణక్య విద్యార్థుల ప్రభంజనం!

📰 Generate e-Paper Clip


ప్రతిభావంతులకు నగదు బహుమతులు అందజేసిన కరస్పాండెంట్ ఆడెపు రవీందర్.


మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి);
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని చాణక్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన సి-క్యాట్ (C-CAT) పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అద్భుత ఫలితాలతో రాణించారు. టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులకు రూ.1000, రూ.500, రూ.250 నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ చేతుల మీదుగా అందజేశారు.మొత్తం 202 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, వారిలో 148 మంది (సుమారు 73%) క్వాలిఫై కావడం పాఠశాల విద్యా ప్రమాణాలను ప్రతిబింబించింది. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ మాట్లాడుతూ, ఈ పరీక్ష విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి రాబోయే వార్షిక పరీక్షల్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా ప్రేరణ కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యే లక్ష్యంగా పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు పాఠశాల యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular