📄 ePaper
Thursday, April 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగ విద్యార్థి చనిపోవడం దురదృష్టకరం;;సిపిఎం

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగ విద్యార్థి చనిపోవడం దురదృష్టకరం;;సిపిఎం

📰 Generate e-Paper Clip

బ్రహ్మంగారి మఠంప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)తోట్లపల్లి గ్రామం విధులపట్ల నిర్లక్షంగ వ్యవహరించిన విధ్యుత్ అధికారిని సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలి,ఆశ్రమంలో భద్రత, పర్యవేక్షణ,చర్యలు చేపట్టాలి,మృతుడికుటుంబానికి 50,లక్షల ఆర్థిక సాయం అందజేయాలి,సిపిఎం
బ్రహ్మంగారి మఠం మండలం తోట్లపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమం వద్ద 33 లెవెన్ కేవీ విధ్యుత్ వైర్ కారణంగ మరణించిన కార్తీక్ మృతదేహాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
జి.శివకుమార్ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ మండల కమిటీ సభ్యులు సానా గోవిందస్వామి,
రెబ్బ నరసింహలు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దు రాహుల్ బృందం సందర్శించి మృతదేహానికినివాళి ఆర్పించి,కార్తీక్ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు,అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి,శివకుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా,దర్శి మండలం బోట్లపాలెం గ్రామానికి చెందిన కార్తీక్ అనే విద్యార్థి ఆచలానoద ఆశ్రమంలో ఉంటూ బ్రహ్మంగారిమఠంలో ఉన్న దీప్తి ప్రైవేట్ హై స్కూల్ నందు 8.వతరగతి చదువుకుంటున్నాడని సోమవారం రాత్రి స్నానానికి వెళ్లిన కార్తీక్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంకారణంగ క్రిందకు వేలాడుతున్న 33 లెవెన్ కె.వి వైర్లను తగులుకొని మరణించడం దురదృష్టకరమని భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకొని తన కుటుంబానికి అండగ నిలవాల్సిన విద్యార్థి అధికారుల నిర్లక్యానికి బలికావటం బాధాకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు,పేదరికం కారణంగ అచలానంద ఆశ్రమం లో ఉంటు అక్కడ సేవచేస్తూ రాష్ట్రo లోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది విద్యార్థులు బ్రహ్మంగారిమఠంలో చదువుకుంటున్నారని వారి ఆలనా పాలన ఆశ్రమ నిర్వాహకులు చూస్తున్నారని వారు గుర్తు చేశారు.ఆశ్రమం దగ్గర ఏర్పాటు చేసిన కులాయి దగ్గర స్నానం చేసి వస్తానని వెళ్లిన కార్తీక్ కేవలం అధికారుల నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం కారణంగానే మరణించారని వారు ఆరోపించారు.నీటి కులాయికి 15,20 అడుగుల దూరంలోనే 33 11 కేవీ వైర్లు కేవలం ఏడడుగుల ఎత్తులో కిందికి వేలాడుతున్నాయని ఆశ్రమ నిర్వాహకులు అనేకమార్లు సంబదిత విద్యుత్ ఏఈ గారి దృష్టికి తెచ్చిన సమస్యను పరిష్కరించకపోగా నిర్లక్ష్యంగ దాటవేశాడని ఆశ్రమంలో పనిచేస్తున్నపలువురు సిబ్బంది తెలిపారని వారన్నారు, అక్కడ వేలాడుతున్న విద్యుత్ వైర్లు ఏ రకంగా ఎవరికీ ఉపయోగంలో లేవని అటువంటి వైర్లను తొలగించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగ వ్యవహరించి విద్యార్థి మరణానికి కారణమైన సంబంధిత అధికారిని సస్పెండ్ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆశ్రమంనిర్వాహకులు సరైన పర్యవేక్షణ నిర్వహించడం లేదని భద్రతాచర్యలుకూడాలేవని సోమవారం రాత్రి సమయంలో బాలుడు చనిపోతే మంగళవారం ఉదయం వరకు గుర్తించక పోవటాన్ని, ఇక్కడ ఉన్న పనిచేయని సీసీ కెమెరాలు చూస్తే అర్థమవుతుందని వారన్నారు, 23 మంది వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులే కాక నిరంతరం వందల మంది పండుగ సందర్భాలలో వేలమంది భక్తులు యాత్రికులు ఇక్కడికి వస్తుంటారని ఇటువంటి ఆశ్రమంలో నిరంతరం పర్యవేక్షణ అవసరమని ఆ లోపం స్పష్టంగాకనిపిస్తుందని వాటి పట్ల ఆశ్రమ నిర్వాహకులు దృష్టి పెట్టాలని వారికి సూచించారు మృతుడి కుటుంబానికి విద్యుత్ డిపార్ట్ మెంట్, ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వం నుండి 50,లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని వారు డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు తలెత్తకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular