📄 ePaper
Thursday, April 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల పంచాయితీ రెండవ వార్డులో కలుసిత నీరును అరికట్టాలి

పోరుమామిళ్ల పంచాయితీ రెండవ వార్డులో కలుసిత నీరును అరికట్టాలి

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)పోరుమామిళ్ల పంచాయితీ రెండవ వార్డులో కలుసిత నీరును అరికట్టాలి,రెండు నెలలుగా మంచినీటి పైపు డ్రైనేజీ లో కలుసితమైన పట్టించుకోని అధికారులు,యన్ భైరవప్రసాదు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.ఆఫీస్ ముందు సిపిఎం పోరుమామిళ్ల మండల్ల కమిటీ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పంచాయతీ ఒకటో సచివాలయం పరిధిలోని రెండో వార్డు సంబంధించి మంచినీటి పైపు డ్రైనేజీలో కలిసితమై ప్రజలకు మంచినీటి సౌకర్యం లేకుండా రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని అధికారులు అంటూ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది, తథనాంతరంసమస్యను పరిష్కరించాలంటూ ఎంపిడిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శిలు యన్ భైరవప్రసాదు సోమయ్య, ప్రకాష్ గౌసియాభేగం ఇరువురు సంయుక్తంగా వారు మాట్లాడుతూ.పోరుమామిళ్లలోని పంచాయతీ పరిధిలో ఒకటవ సచివాలయం ఎదురుగా ఉన్న డ్రైనేజీ లో మంచినీటి పైపు పగిలి రెండు నెలలుగా కలుషితమై ఏ ఇంట్లో కొళాయి తిప్పితే ఆ ఇంట్లో కలుషితమైనటువంటి నీరు వస్తా ఉందని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారన్నారు రెండో వార్డుకు సంబంధించిన ప్రజలు కలుషిత మైన నీళ్లు వస్తున్నాయని పంచాయతీ అధికారుల దగ్గరికి తిరుగుతూ ఉన్న వారు పట్టించుకోకుండా ఉంటూ ఉన్నారని ఎండాకాలంలో మంచినీటి సౌకర్యం కల్పించాల్సినటువంటి పంచాయతీ అధికారులు కలుషితమైన నీటిని ప్రజలకు అందిస్తే ఆ నీళ్ళు తాగుతే వాంతులు విరేచనాలు డెంగ్యూ జ్వరాలు మలేరియాను టైఫాయిడ్ను చికెన్ గున్న ఢైయేరియా, జబ్బులు వెంటనే వస్తాయని ఆ వ్యాధులు బారిన ప్రజలు పడితే చాలామంది ఆరోగ్యంగా నష్టపోతారని వారన్నారు పోరుమామిళ్ల పంచాయతీకి ఇంటి పన్ను రూపంగా వాటర్ పన్ను రూపంగా దాదాపు కోటి రూపాయలు డబ్బులు పంచాయితీ కి వచ్చిందని వారన్నారు పంచాయతీలో ఉన్న డబ్బులను వెంటనే తీసి అక్కడ డ్రైనేజీ లో ఉన్న లీకైన మంచినీటి పైపును సరిచేసి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు యుద్ధ ప్రాతిపధిగా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు వారు అన్నారు సచివాలయాలలో సచివాలయం సిబ్బంది ఆ వార్డుకు సంబంధించినటువంటి ఏ పనులు చేయడం లేదని వార్డులలో తిరగడం లేదని వారన్నారు, పంచాయతీలో పన్నులు వసూలు చేసినారు సంతోషమే కానీ పేదవాడి నడ్డి ఇరిసినట్టుగా పన్నులు డబ్బులను లాక్కొని పంచాయతీల అభివృద్ధి చేయడంలో ఎనక భాగంలో ఉన్నారని వారు అన్నారు ఇప్పటికే పోరుమామిళ్లలో డ్రైనేజ్ కొరత చాలా ఉందని పైప్ లైన్ లీకేజీలు చాలా ఉన్నాయని సిమెంట్ రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని లైటింగ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని ప్రజలు తమ బాధలు చెప్పుకుంటున్నారని వారు అన్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ఎండిఓ గారు వెంటనే యుద్ధ ప్రాతిపదినిదిగా డ్రైనేజీలో పైప్ లైన్ లీకును అరికట్టి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని వారన్నారు, లేని పక్షం అయితే దీక్షలకు వెళ్లి ఆ సమస్యను కలెక్టర్ దిగిచ్చేంత వరకు దీక్షలు చేస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుసులూరు రవి,బీబి, మేరి, బాషా వార్డువాసులు శ్రీనివాసులు, దస్తగిరిమ్మ, చంద్ర, భారతి, వెంకటమ్మ,అభినందనలతో.యన్ భైరవ ప్రసాద్ సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular