📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబేగంపేటలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ – 19 సిలిండర్లు స్వాధీనం

బేగంపేటలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ – 19 సిలిండర్లు స్వాధీనం

📰 Generate e-Paper Clip

బేగంపేటలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ – 19 సిలిండర్లు స్వాధీనం

బెజ్జంకి, ఏప్రిల్ 7(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ ఘటన వెలుగు చూసింది. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా శీలం నర్సయ్య ఇంట్లో 19 గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సిద్దిపేట డీఎస్వో తనుజ, డీఎల్ఎంఓ శివరంజని తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 19 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి అక్రమ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular