📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetనిరుద్యోగ బాధతో యువకుడి విషాదాంతం

నిరుద్యోగ బాధతో యువకుడి విషాదాంతం

📰 Generate e-Paper Clip

నిరుద్యోగ బాధతో యువకుడి విషాదాం

బెజ్జంకి,ఏప్రిల్ 6(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మారూ సుధాకర్ రెడ్డి కుమారుడు మారూ భాగ్యరెడ్డి (34) ఆత్మహత్య చేసుకున్నాడు.భభాగ్యరెడ్డి గతంలో లండన్‌లో ఉద్యోగం నిర్వహించి, కరోనా తర్వాత భారత్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం బెంగళూరు, పూణే నగరాల్లో కొంతకాలం పనిచేసినా, గత రెండు నెలలుగా నిరుద్యోగంతో ఇంటి వద్దనే ఉండేవాడు. ఈ పరిస్థితి కారణంగా మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఏప్రిల్ 5 సాయంత్రం తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన అతను, అనంతరం ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించిన తరువాత, ఏప్రిల్ 6 ఉదయం పొలం సమీపంలోని బావిలో అతని మృతదేహం కనిపించింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నిరుద్యోగం వల్ల కలిగిన మానసిక ఆందోళన కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular