📄 ePaper
Monday, April 20, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్...

ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట, ఏప్రిల్ 6, ప్రజావాణి

ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ విద్యాశాఖ మరియు ఈడబ్ల్యూఐడిసి అధికారులతో సమావేశం నిర్వహించి 2017-18 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు , కేజీబీవీలు మోడల్ స్కూల్ లలో చేపట్టిన అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, లేబరేటరీలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు మొత్తం 92 పనులు మరియు వివిధ రిపేర్లకు సంబంధించి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ చివరి దశలో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అదేవిధంగా మిగతా పనులను మే చివరి వారంలోగా పూర్తిచేసి జూన్ లో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఏ పని కూడా పెండింగ్లో ఉండకుండా అన్ని పూర్తి చేసి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఈడబ్ల్యూఐడిసి ఈఈ శ్రీనివాస్ రెడ్డిని, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో విద్యా శాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular