📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper

📰 Generate e-Paper Clip

బద్వేల్ నియోజకవర్గం – పోరుమామిళ్ల మండలం – గానుగపెంట పంచాయతీ

 

గానుగపెంట పంచాయతీ సర్పంచిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చవ్వా వెంకల్ రెడ్డి గారు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఆ పంచాయతీకి సంబంధించిన ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారిని వారి స్వగృహంలో కలవడం జరిగింది.

 

ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి గారు మాట్లాడుతూ, పోలీసులు ఎంతటి దౌర్జన్యాలకు పాల్పడినా, ఎన్ని బెదిరింపులకు గురిచేసినా భయపడకుండా ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా ధైర్యంగా నిలబడినందువల్లే ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచిందని, అందుకు గానుగపెంట పంచాయతీలో వచ్చిన భారీ విజయం ఒక నిదర్శనమని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా భారీ మెజారిటీతో విజయం సాధించిన చవ్వా వెంకల్ రెడ్డి గారిని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు ఘనంగా సన్మానించారు.

 

ఈ కార్యక్రమంలో పోతిరెడ్డి సంధీప్ రెడ్డి గారు (అమెరికన్ ఫుట్‌బాల్ భారత జట్టు కెప్టెన్) పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ క్రిష్టయ్య, వీరభద్రుడు, కృష్ణారెడ్డి, వెంకటయ్యతో పాటు ఆ పంచాయతీకి సంబంధించిన ముఖ్య నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాగార్జున రెడ్డి గారు భరోసా ఇచ్చారు. రాబోయే 2029 ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.