📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మి

పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మి

📰 Generate e-Paper Clip

 

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి – ముప్పు శ్రీనివాస్

ఎల్కతుర్తి, నవంబర్ 28 (ప్రజావాణి)

పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ అన్నారు.ల్కతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కళ్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, సొసైటీ బ్యాంకు అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.