📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపత్తి పంట మాటున గంజాయి సాగు.. రెండున్నర ఎకరాల్లో గుర్తింపు

పత్తి పంట మాటున గంజాయి సాగు.. రెండున్నర ఎకరాల్లో గుర్తింపు

📰 Generate e-Paper Clip

*పత్తి పంట మాటున గంజాయి సాగు.. రెండున్నర ఎకరాల్లో గుర్తింపు*

*బెంబర్ శివారులో భారీగా గంజాయి మొక్కలు, ఎండిన ఆకులు స్వాధీనం.. నిందితుడి అరెస్ట్*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 28:-
జిల్లాలో అక్రమ గంజాయి సాగు, విక్రయాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ‘గంజాయి గస్తీ’ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ఇందులో భాగంగా తానూర్ మండలం బెంబర్ గ్రామ శివారులో పత్తి పంట మాటున అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు గుర్తించారు. సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించి దాడులు నిర్వహించారు.
పత్తి పంట మధ్యలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలంలో గంజాయి మొక్కలతో పాటు ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిందితుడిని తానూర్ పోలీసులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు పంచ సాక్షుల సమక్షంలో స్వాధీనం ప్రక్రియను నిర్వహించారు.
ముధోల్ సీఐ రవీందర్ నాయక్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్రమ గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగుపై నిరంతర తనిఖీలు చేపడుతూ మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.