*వ్యక్తిగత కారణాలతో వివాహిత మహిళ ఆత్మహత్య*
*కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చిరాగ్ పల్లి పోలీసులు*
జహీరాబాద్, నవంబర్ 27 (ప్రజావాణి): మండలంలోని చిరాగ్ పల్లి గ్రామా నివాసురాలు వివాహిత మహిళ జంగిలి శ్రీవాణి @ సుప్రియ భర్త కి.శే. జగన్నాథ్, వయ్యసు: 24 సం రాలు, వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జంగిలి శ్రీవాణి అలియాస్ సుప్రియ భర్త కి శే జగన్నాథ్, వయ్యసు: 24 సం రాలు, వ్యక్తిగత కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతురాలి తల్లి ఏర్పుల ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలింఛి విచారణ ప్రారంభించినట్లు తెలిపినారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

