📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

📰 Generate e-Paper Clip

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సాధించాలి.. పౌరులుగా మన బాధ్యతలను విస్మరించకూడదు

– అంబేద్కర్ కమిటీ కార్యదర్శి, జర్నలిస్ట్ అనంత కుమార్

తవణంపల్లి, నవంబర్ 27:

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అంబేద్కర్ కమిటీ కార్యదర్శి, జర్నలిస్ట్ అనంత కుమార్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే పునాది అని, దేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ రచనా సంఘం చేసిన విశేష కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కును కల్పించిందని తెలిపారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందన్నారు.

హక్కుల కోసం పోరాడాలి.. బాధ్యతలను విస్మరించకూడదు

రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడికి పూర్తి అవగాహన ఉండాలని, అదే సమయంలో రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించి ఆచరించాలని అనంత కుమార్ సూచించారు. సమానత్వమే ప్రజాస్వామ్యానికి బలమని, కులమతాలకు అతీతంగా మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అణగారిన, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించడంతో పాటు ప్రతి ఒక్కరికీ న్యాయం, స్వేచ్ఛ, సమాన అవకాశాలు అందేలా సమాజం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగం కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజల హక్కులను కాపాడే రక్షణ కవచమని, పౌరుల బాధ్యతలకు దిశానిర్దేశం చేసే మార్గదర్శి అని అభివర్ణించారు. రాజ్యాంగాన్ని చదవడం మాత్రమే కాకుండా అందులోని స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని అన్నారు.

కులం కంటే మానవత్వం గొప్పదని, వివక్ష కంటే సమానత్వం గొప్పదని పేర్కొంటూ పేదవాడి నుంచి ధనవంతుడి వరకు అందరికీ సమాన న్యాయం అందించేదే భారత రాజ్యాంగమని తెలిపారు. హక్కులపై అవగాహన ప్రతి పౌరుడి శక్తి కాగా, బాధ్యతలను నిర్వర్తించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని స్పష్టం చేశారు.

భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అనంత కుమార్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలు బలపడినప్పుడే ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లుతుందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.