📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసేవాలాల్ ఆలయ భూమి పూజకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు..

సేవాలాల్ ఆలయ భూమి పూజకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు..

📰 Generate e-Paper Clip

సేవాలాల్ ఆలయ భూమి పూజకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు..
ప్రజావాణి,నెల్లికుదురు: నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగులో లంబాడాల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ భూమి పూజకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, మహబూబాబాద్,ఇనుగుర్తి,గూడూరు మండలాల కాంగ్రెస్ శ్రేణులు,గిరిజనులు గురువారం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్ మాట్లాడుతూ..మానుకోట ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్,డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ ల పిలుపు మేరకు నాలుగు మండలాల నుంచి భారీగా తరలి వెళుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడాల ఆత్మగౌరవాన్ని చాటుతూ 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సేవాలాల్ ఆలయాన్ని నిర్మిస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్, వివిధ వివిధ గ్రామాల సర్పంచులు వీరన్న, హేమలత శ్రీను,ధనమ్మ అమృ,అశోక్, సోమన్న,అంబరు తోపాటు పలుమండలాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.