నాగారంలో పర్యటించిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి

  గృహ ప్రవేశానికి హాజరు, ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25:జిల్లా లోని లింగాల గణపురం మండలం, నాగారం గ్రామంలో బుధవారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జెడ్పిటిసి సభ్యులు గుడి వంశీధర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గొల్లపల్లి ఎల్లగౌడ్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన గృహంలోకి ప్రవేశించిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, కొత్త ఇంట్లో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని...