కొన్నె గ్రామ మాజీ ఎంపీటీసీ కుమార్తె వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా
జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మల్గ సిద్దిరాములు కుమార్తె వివాహ వేడుక బచ్చన్నపేటలోని శ్రీనిధి ఫంక్షన్ హాల్ లో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన దంపతులు సుఖసంతోషాలతో, అన్యోన్య దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. పెద్దలను గౌరవిస్తూ, కుటుంబ సభ్యులతో...