📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం

ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం

📰 Generate e-Paper Clip

ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం

విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

విద్యాభివృద్ధికి రూ.800 కోట్ల నిధుల కేటాయింపు

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 26:

ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

గురువారం పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ మహిళా, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలల్లో హరే రామ హరే కృష్ణ ట్రస్టు భాగస్వామ్యంతో ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకంలో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి ముచ్చటించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం రూ.800 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. హరే రామ హరే కృష్ణ ట్రస్టు భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు పుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, యూనిఫాంలను కూడా ప్రభుత్వం అందిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించి, వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుపై పూర్తి దృష్టి సారించేలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.