📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణలక్నవరం ప్రెస్ క్లబ్ ఆధ్యాత్మిక యాత్ర

లక్నవరం ప్రెస్ క్లబ్ ఆధ్యాత్మిక యాత్ర

📰 Generate e-Paper Clip

లక్నవరం ప్రెస్ క్లబ్ ఆధ్యాత్మిక యాత్ర

బుగులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పాత్రికేయులు

– జాతర ఏర్పాట్లపై సీఐతో భేటీ

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

రేగొండ మండలం బుగులోని వెంకటేశ్వర స్వామి గుట్ట మీద ఉన్న స్వామివారిని ములుగు జిల్లా గోవిందరావుపేట లక్నవరం ప్రెస్ క్లబ్ పాత్రికేయులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, జాతర విజయవంతంగా జరగాలని మొక్కుకున్నారు.

ఈ కార్యక్రమంలో లక్నవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బత్తిని వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి సామ బుచ్చిరెడ్డి, కోశాధికారి తుక్కాని ఎల్లారెడ్డి, సహాయ కార్యదర్శి కళ్లెం రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం ములుగు – ఘనపూర్ సీఐ కర్ణాకర్ రావు గారిని కలుసుకుని జాతర ఏర్పాట్లపై చర్చించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ట్రాఫిక్, భద్రత, తాగునీరు, పార్కింగ్ వంటి విషయాల్లో పోలీస్ శాఖ తరఫున పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నామని సీఐ కర్ణాకర్ రావు తెలిపారు.

గతంలో కూడా కర్ణాకర్ రావు సీఐగా ఉన్న సమయంలో జాతరను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన విషయాన్ని ప్రెస్ క్లబ్ పాత్రికేయులు గుర్తుచేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నందుకు సీఐ గారిని అభినందించారు.

బత్తిని వెంకట్ మాట్లాడుతూ… “గుట్ట మీద స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయం” అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.