ప్రజల కష్టసుఖాల్లో గొర్రె కిరణ్ కుమార్ కీలక పాత్ర.. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి బాధిత కుటుంబాలకు పరామర్శ!
మృతుల కుటుంబాలకు అండగా నిలిచి.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ధైర్యం కల్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హసన్‌పర్తి, నవంబర్ 24, మన ప్రజావాణి:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66వ డివిజన్ హసన్‌పర్తి గ్రామంలో ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మృతుల కుటుంబాలను పరామర్శించి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి వారికి ధైర్యం చెప్పారు.
హసన్‌పర్తి గ్రామానికి చెందిన బోడ కిషోర్, జన్ను రవీందర్, బొమ్మరాజు కుమారస్వామి, మేకల కనకలక్ష్మి, తాళ్ల శ్రీనివాస్, హోంగార్డు రవి గారి భార్య కాలే సరోజన, వల్లాల లక్ష్మి గార్లు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గారు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ మృతుల కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, వారికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రజల మధ్య ఉంటూ వారి బాధల్లో భాగస్వాములు కావాలని, ప్రతి కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా నిలవాలని పేర్కొన్నారు.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న జన్ను రమేష్, జన్ను ఎల్లమ్మ, వీరస్వామి కుటుంబాలను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారితో కలిసి సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను గొర్రె కిరణ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మనోధైర్యం కల్పిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలే లక్ష్యంగా..
66వ డివిజన్‌లో ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గొర్రె కిరణ్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సంతోషాల్లోనే కాకుండా కష్టకాలంలోనూ వారి పక్కన నిలబడటమే నిజమైన ప్రజాసేవ అనే భావనతో ముందుకు సాగుతున్నారు.
ఈ కార్యక్రమంలో 65వ డివిజన్ అధ్యక్షులు నేదునూరి సునీల్, హసన్‌పర్తి మహిళా మండల అధ్యక్షురాలు జోరుకపూల, మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్ చైర్మన్ కుమారస్వామి, సీనియర్ నాయకులు ఎల్ఐసీ వెంకటేశ్వర్లు, కనపర్తి కిరణ్, విసం సురేందర్ రెడ్డి, ఐలయ్య, జన్ను రవీందర్, ఆరెల్లి వెంకటస్వామి, పుల్లా రవీందర్, చిర్ర విజయ్, కూకుట్ల రమేష్, రామంచ దయాకర్, మేకల ఆనంద్, బిగుళ్ల సురేష్, దూడల ప్రకాష్, జన్ను అశోక్ తదితరులు పాల్గొన్నారు.

