📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఘనంగా గౌడన్నల కార్తీక వనభోజనాలు

ఘనంగా గౌడన్నల కార్తీక వనభోజనాలు

📰 Generate e-Paper Clip

ఘనంగా గౌడన్నల కార్తీక వనభోజనాలు

మల్లూరు క్షేత్రంలో గీత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం

గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి – జూనియర్ న్యాయవాది గాజుల శ్రావణ్ కుమార్ గౌడ్

మంగపేట, నవంబర్ 23 (ప్రజావాణి):

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో సోమవారం గీత కార్మికుల కార్తీక వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. చెరుపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గాజుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మండలవ్యాప్తంగా గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్య అతిథిగా హాజరైన చెరుపల్లి గ్రామానికి చెందిన జూనియర్ న్యాయవాది గాజుల శ్రావణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మంగపేట మండలంలోని గీత కార్మికులకు ప్రమాద బీమా, కాటమయ్య రక్షణ కిట్లు, చేయూత పెన్షన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గీత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు అందడం లేదన్నారు. ఏజెన్సీ చట్టాల పేరుతో వృత్తిదారులకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి, వారి కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

అనంతరం వివిధ గ్రామాల్లో గీత వృత్తిని కొనసాగించి, ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ గీత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అందరూ కలిసి ఆత్మీయంగా వనభోజనాలు చేస్తూ సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో రావుల శ్రీనివాస్, గాజుల ఈశ్వరయ్య, నక్క యాకయ్య, గంట డేగరాజు, గంట చిట్టిబాబు, గాజుల పవన్ కుమార్, గాజుల లక్ష్మయ్య, బొంబోతుల మురళి, బండపల్లి యాకయ్య, గడ్డం పరమేష్, గడ్డం మల్లయ్య, గౌన్ రమేష్ తదితర గీత కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.