రంగసముద్రం పంచాయతీ నూతన శకానికి నాంది పలకండి: కూటమి అభ్యర్థుల విజయమే మన లక్ష్యం – మాజీ ఎంపీటీసీ కలవకూరి రమణ పిలుపు
"అభివృద్ధే ధ్యేయం.ప్రజా సంక్షేమమే మా మార్గం.రంగసముద్రం భవిష్యత్తు కోసం కూటమికే మన ఓటు! పోరుమామిళ్ల నవంబర్ 22:ప్రజావాణి పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. కూటమి మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం విస్తృతంగా సాగుతోంది.ఈ క్రమంలోనే,రంగసముద్రం పంచాయతీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థిని దాసరపల్లి శ్రీ దివ్యను,అలాగే 14 మంది వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీటీసీ,ప్రస్తుత 8వ వార్డు సభ్యుల అభ్యర్థి కలవకూరి రమణ...