📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమాటలు కాదు లెక్కలు తేండి.

మాటలు కాదు లెక్కలు తేండి.

📰 Generate e-Paper Clip

-మాటలు కాదు లెక్కలు తేండి.
-ప్రశ్నకు ముద్ర కాదు సమాధానం కావాలి.
-బొడ్రాయి మీద కాదు రికార్డుల మీద తేల్చండి.
-హామీల లెక్క వర్సెస్ పదేళ్ల లెక్క
గెలిచేది మాటలు కాదు పనులు చేసినవాడే.
గోవిందరావుపేట మండలం చూస్తోంది ఎవరు నిజమో.?
-మైకులు కాదు రికార్డులు మాట్లాడాలి.
-ప్రశ్నించడం హక్కు.. సమాధానం చెప్పడం బాధ్యత.
-దేవాదుల నీరు ఎప్పుడు లక్నవరానికి.?
-ఇళ్లు ఉద్యోగాలు లెక్కలతో చూపించండి.?
-గతం చెబుతుంది వర్తమానం చూపిస్తుంది.
!ప్రజల ముందు తేలాలి నిజం ఏదో.?

ములుగు ప్రతినిధి (ప్రజావాణి)

గోవిందరావుపేట మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల యుద్ధం మొదలైంది. పంచ్ లు పేలుతున్నాయి.
ఒక పక్క హామీల లెక్క బీఆర్ఎస్ అడుగుతున్నారు. మరో పక్క పదేళ్ల లెక్క కాంగ్రెస్ అడుగుతున్నారు.
ప్రజల ప్రశ్నలకు ముద్రలు వేయడం కాదు సమాధానం చెప్పడం నాయకుల పని.!
రుణమాఫీ అందరికి అందిందా లేదా అనేది బ్యాంకు లెక్కలు చెబుతాయి.
రైతు భరోసా నిధులు గ్రామాలకు చేరాయా లేదా అనేది రైతులే చెబుతారు.
ఇందిరమ్మ ఇళ్లు ఎవరికి వచ్చాయో పేదల జాబితానే చెబుతుంది.
దేవాదుల నీరు లక్నవరానికి ఎప్పుడు వస్తుందో కాలువలే చెబుతాయి.
పొట్లాపూర్ లిఫ్ట్ పనులు ఎంత దూరం వచ్చాయో క్షేత్రమే చెబుతుంది.
ఉద్యోగాలు ఎన్ని వచ్చాయో నోటిఫికేషన్లే చెబుతాయి.
గత పదేళ్ల హామీలు ఏమయ్యాయో ప్రజలకు ఇంకా గుర్తుంది.
మూడేళ్లలో ఏం జరిగిందో ప్రజలు కళ్లతో చూస్తున్నారు.
బొడ్రాయి మీద ప్రమాణం కాదు రికార్డుల మీద నిజం తేలాలి???
మైకుల ముందు అరవడం కాదు మండల ప్రజల ముందు లెక్క చెప్పాలి.!
వివరాలు.. సేకరణ.. ప్రజావాణి.. త్వరలో

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.