పస్రాలో పోలీస్ శాఖ మెగా హెల్త్ క్యాంపు
SI తాజుద్దీన్
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రం పస్రాలో మెగా మెడికల్ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయనున్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఈ వైద్య శిబిరం జరగనుందని ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు.
స్థానిక పిఎస్ఆర్ గార్డెన్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.
అనుభవం కలిగిన వైద్యుల ఆధ్వర్యంలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ అవకాశాన్ని పస్రా తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ తాజుద్దీన్ కోరారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ క్యాంపు ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
వైద్య పరీక్షలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు
ముందుగా వచ్చిన వారికి ముందుగా వైద్య సేవలు అందిస్తారు.
ప్రజలు తమ వివరాలతో పాటు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు.
పోలీస్ శాఖ చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని
ఆరోగ్యమే మహాభాగ్యమనే సందేశంతో ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు.

