ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన సర్పంచ్ చింత రవి
జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి):రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం కామారెడ్డిగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ చింత రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా డిపిఓ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పేద ప్రజలకు, భూమి లేని నిరుపేదలకు ఈ బీమా పథకం చాలా ఉపయోగకరమైందని అన్నారు. ఈ పథకం ప్రారంభించడం రాష్ట్రంలోని పేద ప్రజలు హర్షించదగ్గ విషయమని కొనియాడారు. తెల్ల రేషన్ కార్డు...