గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్త్రీ శక్తి దివస్
దండేపల్లి, నవంబర్ 19 (ప్రజావాణి):
దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని స్త్రీ శక్తి దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ద్వారకా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చిన్న నరసయ్య మాట్లాడుతూ.. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వీరత్వం, ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు చిన్ననాటి నుంచే ధైర్యసాహసాలు, దేశభక్తి భావాలను అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ద్వారకా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చిన్న నరసయ్య, గుడిరేవు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బుచ్చన్న, ఉపాధ్యాయురాలు శ్యామల, సీఆర్‌పీ సురేందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ ధనలక్ష్మి, విద్యా వాలంటీర్ అభినవ్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

