📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణ748 మందికి నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

748 మందికి నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

📰 Generate e-Paper Clip

*748 మందికి నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ…*

*హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 18*

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా బుధవారం రోజు 748 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు , వృద్ధులు , దివ్యాంగులు , ఒంటరి మహిళలు మరియు సమాజంలోని అర్హులైన నిరుపేదలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విప్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గతంలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన లబ్ధి దారులకు నేడు కొత్తగా పెన్షన్లు మంజూరు కావడం ఎంతో సంతోషకరమైన విషయం. పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని , వృద్ధులు , దివ్యాంగులు, నిరుపేదలకు ఆత్మగౌరవం తో జీవించేందుకు ప్రభుత్వం అందిస్తున్న భరోసా అని తెలిపారు..
ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొ క్కటిగా అమలు చేస్తూ , అర్హులైన ప్రతి కుటుంబా నికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా ముందుకు సాగుతోందని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ సొమ్మును లబ్ధిదారులు తమ నిత్యావసరాలు , వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతి నిధులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , సంబంధిత శాఖల అధి కారులు , నూతన పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.