📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణభువనగిరి నియోజక వర్గంలో 1,894 కి నూతన పింఛన్లు మంజూరు..

భువనగిరి నియోజక వర్గంలో 1,894 కి నూతన పింఛన్లు మంజూరు..

📰 Generate e-Paper Clip

*భువనగిరి నియోజక వర్గంలో 1,894 కి నూతన పింఛన్లు మంజూరు…*

*లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*

*సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లబ్ధిదారులు.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 18*

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ఏకే ప్యాలెస్‌లో బుధవారం రోజు నిర్వహించిన కార్య క్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని , భువనగిరి మండలం , మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ లను అందజేశారు. భువనగిరి మండలంలో 1,044 మందికి , మున్సి పాలిటీలో 850 మందికి కలిపి మొత్తం 1,894 మందికి నూతన పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని , అర్హులైన అనేకమంది పింఛన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి కల్పించిందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించు కోకుండా పాలన సాగించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే , ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రస్తుత ప్రజా ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తో పాటు అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వృద్ధులు , వితంతువులు, దివ్యాంగులు , నిరుపేద లకు చేయూత పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ సామాజిక బాధ్యతగా భావిస్తోందన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పింఛన్ల కోసం ఎదురుచూసిన అర్హులకు నేడు మంజూరు ప్రొసీడింగ్స్ అందడం ప్రజా ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెర వేరుస్తూ , సంక్షేమం మరియు అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. భువనగిరి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ , అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా తన వంతు బాధ్యతగా పనిచేస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి , జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ అవేస్ చిస్తి , మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల ,ఆత్మ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణా రెడ్డి , భువనగిరి , చందు పట్ల పిఎసిఎస్ చైర్మన్లు పక్కిర్ కొండల్ రెడ్డి , జీలుగు సతీష్ పవన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు , మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లంల జంగయ్య యాదవ్ , కూర వెంకటేశ్, అన్ని గ్రామాల సర్పంచులు , కౌన్సిలర్లు , కో -అప్షన్ సభ్యులు , ప్రజా ప్రతినిధులు , సంబంధిత అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.